United Kingdom PM Election 2022: యూకే ప్రధాని పదవికి ఎన్నిక ప్రక్రియ ముగింపు.. లిజ్‌ ట్రస్ గెలిచే అవకాశం

యూకే ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ నిన్న సాయంత్రంతో ముగిసింది. దీని ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలో లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలే అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప‌ద‌వికి పోటీ చేసిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ మొదట పోటీలో దూసుకుపోయినట్లు కనపడినప్పటికీ, చివరకు వెనకబడ్డారు.

United Kingdom PM Election 2022: యూకే ప్రధాని పదవికి ఎన్నిక ప్రక్రియ ముగింపు.. లిజ్‌ ట్రస్ గెలిచే అవకాశం

UK PM Election 2022 Liz Truss' victory over Rishi Sunak

Updated On : September 3, 2022 / 8:46 AM IST

UK PM Election 2022: యూకే ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ నిన్న సాయంత్రంతో ముగిసింది. దీని ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలో లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలే అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప‌ద‌వికి పోటీ చేసిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ మొదట పోటీలో దూసుకుపోయినట్లు కనపడినప్పటికీ, చివరకు వెనకబడ్డారు.

లిజ్‌ ట్రస్ తో కలిసి ఆయన తుది రేసులో నిలిచాక నిర్వహించిన పలు సర్వేలో ఈ విషయం తేలింది. రిషి గెలిస్తే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర లిఖిస్తారు. తుది పోరులో నిలిచిన రిషి సునక్, లిజ్ ట్రస్ దాదాపు నెలరోజులుగా యూకే వ్యాప్తంగా పర్యటించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, మూడు టెలివిజన్ డిబేట్లలో పాల్గొన్నారు. వాటిల్లో రిషి సునక్ కు అంతగా మద్దతు లభించలేదు.

దాదాపు 2,00,000 మంది టోరీ సభ్యుల పోస్టల్, ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమైంది. లిజ్ ట్రస్ కే మద్దతు అధికంగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. తాను గెలిస్తే యూకే జీవన వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌), ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు పరిష్కరిస్తానని రిషి పలుసార్లు చెప్పారు. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ సెప్టెంబరు 6న ఆ పదవికి రాజీనామా చేస్తారు. ఈ మేరకు రాజీనామా లేఖను క్వీన్ ఎలిజబెత్-2కు అధికారికంగా సమర్పిస్తారు.

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్