woman Birth Child On Beach : బీచ్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిక, 6437 కి.మీటర్లు ప్రయాణించి మరీ కల నెరవేర్చుకుంది..కానీ

అందమైన బీచ్ లో బిడ్డను ప్రసవించాలనుకున్న ఓ మహిళకు లేనిపోని ఇబ్బందులు వచ్చాయి. బిడ్డను తీసుకుని ఇంటికెళ్లలేని పరిస్థితుల్లో దంపతులు ఇద్దరు అక్కడే చిక్కుకుపోయారు. పుట్టిన బిడ్డతో సహా బీచ్ లోనే చిక్కుకుపోయింది.

woman Birth Child On Beach : బీచ్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిక, 6437 కి.మీటర్లు ప్రయాణించి మరీ కల నెరవేర్చుకుంది..కానీ

Uk Woman Birth Child On South Korea Beach

UK woman Birth Child On South Korea Beach : కొత్తగా పెళ్లైనవారు హనీమూన్ అందమైన ప్రదేశాల్లో జరుపుకోవాలని ఆశపడతారు. సముద్ర తీరాల్లో ఏకాంతంగా గడపాలని..ప్రకృతిలో ఎంజాయ్ చేయాలని ఆశపడతారు. కానీ ఓ మహిళ మాత్రం తన బిడ్డను సముద్ర తీరంలో అందమైన బీచ్ లో ప్రసవించాలని ఆశపడింది. ఆ ఆశ నెరవేర్చుకోవటానికి ఏకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అందమైన సముద్ర తీరంలో బిడ్డకు జన్మన్వివ్వాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఓ మహిళ 6437 కిలోమీటర్లు ప్రయాణించింది. దానికి ఆమె భర్త కూడా సహకరించాడు. భార్య కోరిక నెరవేర్చటానికి దేనికి వెనుకాడలేదు. ఆమె అనుకున్నట్లుగానే అందైన సముద్ర తీరంలో బిడ్డను జన్మనిచ్చింది. ఆమె కోరిక నెరవేరింది. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది.

బ్రిటన్ నుంచి దక్షిణకొరియా దేశంలోని సముద్ర తీరానికి వెళ్లి బిడ్డను జన్మనిచ్చిన ఆమె భర్త, బిడ్డతో కలిసి గ్రెనడా సముద్ర తీరంలోనే చిక్కుకుపోయింది. బిడ్డ జన్మ దృవీకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తి ఆమె మొదటి బిడ్డ ఓ చోట..భర్త, పుట్టిన చంటిబిడ్డతో మరో దేశంలో చిక్కుకుపోయింది. ఆమె కోరిక ఇన్ని చిక్కులకు దారి తీస్తుందని బహుశా ఆ దంపతులకు తెలుసో తెలీదో గానీ నాలుగు నెలలుగా దక్షిణ కొరియాలోని గ్రెనడా తీరంలోనే ఉండిపోవాల్సి బ్రిటన్ కు చెందిన ఆ జంట.

Diamonds : వజ్రాలకు భూమికి సంబంధమేంటి..? ఒక వజ్రం తయారవ్వడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో తెలుసా..?

అందాల బీచ్ లో బిడ్డను జన్మనివ్వాలని ఆశపడి పరాయి దేశంలో చిక్కుకుపోయిన ఆమె బ్రిటన్ కు చెంది యులియా గుర్జి(Iuliia Gurz)(38) ఆమె యోగా ట్రైనర్. ఆమె భర్త క్లెవ్ (Clive)వయస్సు (51). వీరికి ఇప్పటికే ఎనిమిదేళ్ల కూతురు ఉంది. రెండో బిడ్డకు అందమైన  బీచ్ లో జన్మనివ్వాలని ఆశపడింది. ఆమె కోరిక నెరవేర్చటానికి క్లైవ్ భార్య యులియాను దక్షిణ కొరియాలోని గ్రెనడా బీచ్ కు తీసుకెళ్లాడు. అలా వారు బిడ్డకు జన్మనివ్వటానికి 6437 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఆమె కల నెరవేరింది. యూలియా ఏప్రిల్‌ 23న గ్రెనడీ సాగరతీరంలో బేబీ లూయిస్‌కు జన్మనిచ్చింది.

కానీ వారు బ్రిటన్ (Britain)కు చెందినవారు. బిడ్డను ప్రసవించింది దక్షిణ కొరియా ( South Korea)దేశానికి చెందిన సముద్రతీరంలో. దీంతో ఆ బిడ్డకు జన్మదృవీకరణ సమస్య వచ్చింది. ఏదేశానికి చెందిన బిడ్డ అనే విషయం పెద్ద సమస్యగా మారింది. ఆ బిడ్డ తమ బిడ్డే అని నిరూపించుకోవాల్సి పరిస్థితి వచ్చింది. ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆ బిడ్డకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం అడగడటంతో మొదలయ్యాయి అసలైన చిక్కులు ఆ దంపతులకు. దీంతో వారు బిడ్డ పుట్టినా నాలుగు నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారి స్వదేశం వెళ్లటానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి దగ్గర డబ్బులు కూడా అయిపోవటంతో నానా పాట్లు పడుతున్నారు. మరోపక్క వారి పెద్ద కుమార్తె ఎనిమిదేళ్ల ఎలిజబెత్ యూకేలో ఉండిపోయింది. ఆ పాపను దక్షిణ కొరియా తీసుకురావటానికి పాస్‌పోర్టు రివ్వ్యూ కాకపోవడంతో వారు ఆ చిన్నారిని తమతోపాటు తీసుకురాలేకపోయారు.

ఈ విపత్కర పరిస్థితి గురించి యులియా భర్త క్లైవ్ మీడియాతో మాట్లాడుతు..ఇక్కడి ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌..తమకు పుట్టిన బిడ్డకు తామే తల్లిదండ్రులమని రుజువు చూపించాలంటున్నారని..దీని కోసం తాము రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నామని అది రావాలంటే కొంతకాలం వెయిట్ చేయలంటున్నారని తెలిపాడు. కానీ ఇప్పటి వరకు బర్త్‌సర్టిఫికెట్‌ రాలేదని దీంతో తాము రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడుగామని దానికి వారు ఆ బిడ్డ ఆసుపత్రిలో జన్మించలేదు కాబట్టి తాము బర్త్ సర్టిఫికెట్ ఎలా ఇవ్వగలమని ప్రశ్నిస్తున్నారు అంటూ వాపోయాడు. మీరు బీచ్ లో జన్మించిందని చెబుతున్నారు..కానీ మా వద్ద దానికి సంబంధించి ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు అంటూ వాపోయాడు.

Crime: భలే భలే మగాడివోయ్.. డ్రైనేజీలో దాక్కున్న దొంగ.. అయినా అందులో ఉన్నాడని ఎలా గుర్తించారో తెలుసా?

దీంతో తాము కింగ్‌ యూరోపియన్‌ యూనియన్‌ ఆసుపత్రికి వెళ్లామని..అక్కడి సిబ్బంది కూడా బిడ్డ పుట్టిన వివరాలు నమోదు చేయలేమన్నారని తెలిపాడు. బిడ్డపుట్టిన 24 గంటల తరువాత రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చారు కాబట్టి తాము ఏం చేయలేమని తేల్చి చెప్పారని తెలిపాడు.
పాస్‌పోర్టు ఆఫీసు సిబ్బంది కూడా బిడ్డ జననానికి సంబంధించిన రుజువులు లేవు కాబట్టి తాము ఏమీ చేయలేమన్నారని ఇలా బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఈ ప్రాసెస్ క్లియర్ కాక  మానసికంగా నలిగిపోతున్నామని బాధగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే  6,000 పౌండ్లు ఖర్చయ్యాయి. చేతిలో డబ్బులేదు. యూకే నుంచి సహాయం అర్థించాం కానీ ఎటువంటి స్పందనా రాలేదని వాపోయాడు క్లైవ్.

దీంతో క్లైవ్ యూకేలోని సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించాడు. వారు డిఎన్‌ఏ టెస్టు చేయించాలని సూచించారు. దీనికి సంబంధించి రిపోర్టు రావాల్సి ఉంది. తమ పరిస్థితి గురించి యులియా మాట్లాడుతు..‘‘అనుకున్న కోరిక ప్రకారం బీచ్ లో బిడ్డకు జన్మనిచ్చాను..సంతోషంగానే ఉంది కానీ ప్రసవం కోసం వచ్చి ఈ దేశంలో బందీ అయిపోయాం యూకే వెళ్లలేక..అక్కడే ఉండిపోయిన మా పెద్ద కుమార్తె తరచూ గుర్తుకువస్తోంది. బంధువుల ఇంటిలో ఉంచి వచ్చాం ఆమె ఎలా ఉందో అనే బెంగగా ఉంది’’అంటూ యులియా కన్నీటితో తెలిపింది.