US Elections 2024 : అమెరికా ఎలక్షన్ డే.. ఓటు కోసం వర్జీనియాలో బారులు తీరిన ఓటర్లు..!
US Elections 2024 : వర్జీనియాలోని ఓటర్లు పోలింగ్ స్టేషన్‌ల వద్ద భారీ క్యూలో బారులుతీరారు.

US Elections 2024_ Voters queue up in Virginia
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. వర్జీనియాలోని ఓటర్లు పోలింగ్ స్టేషన్‌ల వద్ద భారీ క్యూలో బారులుతీరారు. అగ్రరాజ్య కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అక్కడి ఓటర్లు ఎంతో ఆసక్తిగా క్యూలో నిలబడ్డారు.
రోస్లిన్‌లో ఇటీవలి చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాతక్మమైన ఎన్నికలలో తమ గళాన్ని వినిపించేందుకు ఓటర్లు మంగళవారం తెల్లవారుజామున మంచుకొరికేచలిని కూడా లెక్కచేయకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
స్థిరత్వం కొనసాగింపు కోరుకుంటున్న ఓటర్లు :
కొంతమంది ఓటర్లు పోలింగ్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సీజే స్టోవెల్, వర్జీనియా నివాసి .. “స్థిరత్వం” కొనసాగింపు కావాలని ఒక ఓటరు తన కోరికను వెలిబుచ్చాడు. చాలా మంది ఓటర్లు స్థిరత్వం కోసం చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయానికి హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా మేము సాధించిన అభివృద్ధిని కొనసాగించే వ్యక్తికి నేను ఓటు వేస్తున్నాను ”అని స్టోవెల్ అనే ఓటర్ పేర్కొన్నారు.
పాల్ లండ్‌బర్గ్ వంటి ఇతరులు తమ అభిమాన అభ్యర్థులకు మద్దతు పలికారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బిలియనీర్ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ఫలితాలను వెంటనే ధృవీకరించడంలో సవాళ్లను కూడా ఎత్తిచూపారు. అన్ని రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అధికారిక ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
హారిస్ గెలిస్తే యూఎస్ మొదటి మహిళగా:
ఈ అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎన్నికైతే, యునైటెడ్ స్టేట్స్ మొదటి మహిళా, మొదటి భారతీయ సంతతి అధ్యక్షురాలు అవుతుంది. రిపబ్లికన్ వైపు.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన వివాదాస్పద 2020 ఓటమి తర్వాత అరుదైన పునరాగమనం ఇది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. శతాబ్దానికి పైగా వరుసగా 2 పర్యాయాలు కొనసాగిన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.
జాతీయ ఎన్నికలు దాదాపు టైగా అంచనా వేయడంతో రేసు తీవ్ర పోటీని కలిగి ఉంది. ఏబీసీ, ఫైవ్ థర్టీ ఎయిట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. హారిస్ 48శాతం వద్ద ట్రంప్ 46.9శాతం వద్ద స్వల్పంగా ఉన్నారు.
ఎన్‌బిసి న్యూస్, ఎమర్సన్ కాలేజీతో సహా ఇతర ప్రధాన పోల్‌లు 49శాతం-49శాతం డెడ్‌లాక్‌ను అంచనా వేశాయి. అయితే ఇప్సోస్ హారిస్ (49శాతం-46శాతం) మూడు పాయింట్ల ఆధిక్యాన్ని అంచనా వేసింది. అట్లాస్ఇంటెల్ ట్రంప్‌కు 50శాతం-48శాతం వద్ద స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చింది.