Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి.. డెమొక్రాట్లు ఓడిపోవడానికి ఐదు కారణాలు ఇవే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. వచ్చే ఏడాది జనవరిలో అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని రెండోసారి ట్రంప్ అదిరోహించనున్నాడు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి.. డెమొక్రాట్లు ఓడిపోవడానికి ఐదు కారణాలు ఇవే..

Donald Trump Kamala Harris

Updated On : November 7, 2024 / 12:00 PM IST

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. వచ్చే ఏడాది జనవరిలో అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని రెండోసారి ట్రంప్ అదిరోహించనున్నాడు. ట్రంప్ విజయం పట్ల అమెరికాలో రిపబ్లికన్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, అమెరికాలో ఎన్నికలకు ముందు మెజార్టీ సర్వే ఫలితాలు డెమొక్రాట్ల పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. కానీ, ఊహించని రీతిలో చివర్లో ట్రంప్ పుంజుకొని విజయకేతనం ఎగురవేశారు. అయితే, ట్రంప్ విజయానికి ప్రధాన ఐదు కారణాలను రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ ఐదు కారణాల వల్ల ట్రంప్ సునాయాసంగా విజయం సాధించాడని అభిప్రాయ పడుతున్నారు.

Also Read: Donald Trump: ట్రంప్ విజయంపై కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

అధికార పార్టీపై వ్యతిరేకత..
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ ఓడిపోవటానికి జో బిడెన్ నేతృత్వంలోని నాలుగేళ్ల పాలన ప్రధాన కారణం. బిడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిరుద్యోగం పెరగడంతోపాటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. కరోనా వైరస్ ఎటాక్ సమయంలో బిడెన్ సమర్ధవంతంగా వ్యవహరించలేదన్న భావన అక్కడి ప్రజల్లో నెలకొంది. యుక్రెయిన్ ను ఆక్రమించకుండా రష్యాను నిరోదించడంలోనూ విఫలమయ్యాడు. గతంలో ట్రంప్ ప్రెసిడెన్సీలో దీనికి విరుద్ధంగా సాగింది.. స్టాక్ మార్కెట్లు పెరిగాయి. నిరుద్యోగ సమస్య పెద్దగా లేదు. దీనికితోడు.. ఓటర్లు కొరుకునేలా కమలా హారిస్ వాగ్దానాలు చేయలేదు.. ట్రంప్ అన్నివర్గాల ప్రజలు మెచ్చేలా వాగ్దానాలు ఇవ్వడం కూడా హారిస్ పై పైచేయి సాధించడానికి కారణంగా చెబుతున్నారు.

గ్రామీణ అమెరికాలో మద్దతు..
ట్రంప్ కు గ్రామీణ అమెరికాలో మెజార్టీ మద్దతు లభించింది. 1960 నుంచి గ్రామీణ అమెరికాలో రిపబ్లికన్లకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. 2016 లో డోనాల్డ్ ట్రంప్ ను వైట్ హౌస్ కు వెళ్లేందుకు శ్వేతజాతీయుల గ్రామీణ ఓటర్లు సహకరించారు. 2024లోనూ మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. గత దశాబ్దాలుగా గ్రామీణ ఓటర్లను ఆశ్రయించడానికి మిలియన్ల డాలర్లు, గణనీయమైన ప్రచార సమయాన్ని వెచ్చించినప్పటికీ డెమొక్రాట్లు వారి మన్ననలు పొందడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. ట్రంప్‌నకు అమెరికాలోని గ్రామీణ ఓటర్ల నుంచి బలమైన మద్దతు ఉంది. అయోవా లాంటి రాష్ట్రాల్లో ఆయన విజయం సాధించడానికి ఇదే కారణంగా నిలిచింది. ఇక జార్జియా, కెంటకీ, నార్త్‌ కరోలినాల్లో ఇదే ఆయనకు ఆధిక్యం తీసుకొచ్చింది

మైనారిటీల్లో ట్రంప్‌కు పెరిగిన మద్దతు..
యూఎస్ లో నల్లజాతి ఓటర్లు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే, ఎప్పుడూ డెమొక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనార్టీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీయాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ట్రంప్ శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపు మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రోవ్యల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి కూడా కలిసొచ్చింది.

Also Read: ట్రంప్ విజయం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఏంటి?

మహిళల్లో కమలకు తగ్గిన మద్దతు..
గ్రామీణ అమెరికాలో, నల్ల జాతీయుల్లో పురుష ఓటర్లు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలిచారు. కీలకమైన రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో లాటినో పురుషుల మద్దతును ట్రంప్ గెలుచుకున్నాడు. పెన్విలేనియాలోని ఆ సమూహంలో ట్రంప్ నకు గతంకంటే అత్యధిక మద్దతు లభించింది. అయితే, కమలా హారిస్ కు మహిళల నుంచి భారీ మద్దతు లభిస్తుందని అందరూ భావించారు. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల హారిస్ నిలబడ్డారు. మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్ కు మెరుగ్గానే ఓట్లు పడ్డాయి. మొత్తంలో.. పురుషుల్లో ట్రంప్ దాదాపు 22శాతం తో ముందంజలో ఉన్నారు. మహిళల్లో హారిస్ ఆధిక్యం ఉన్న 14శాతం తో పోలిస్తే .. హారిస్ లింగ అంతరాన్ని అధిగమించలేక పోయారు.

జో బిడెన్ ఆకస్మిక ఉపసంహరణ..
డెమొక్రాట్లు కమలా హారిస్ ను అధ్యక్ష అభ్యర్ధిగా చాలా ఆలస్యంగా ప్రకటించారు. జో బిడెన్ వయస్సు గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు.. అతని అభ్యర్థిత్వం కమలా హారిస్ కు ఇవ్వబడింది. కానీ, ఆమెకు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించలేదు. ఈ ఆలస్యం కారణంగా.. స్వింగ్ ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా మారారు. ఇది కమలా హారిస్ అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. దీనికితోడు ఎలాన్ మస్క్ బహిరంగంగా ట్రంప్ కు మద్దతుగా ర్యాలీలు నిర్వహించి సోషల్ మీడియాలో ట్రంప్ అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ట్రంప్ కు మస్క్ మద్దతు పెద్ద ఎక్స్ కారకంగా పనిచేసింది.