ప్రాణం కాపాడిన జీన్స్ ప్యాంట్: వాట్ యాన్  ఐడియా

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 11:03 AM IST
ప్రాణం కాపాడిన జీన్స్ ప్యాంట్: వాట్ యాన్  ఐడియా

జీన్స్ ప్యాంట్ ఓ ప్రాణాన్ని కాపాడింది. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తి అతను ధరించిన జీన్స్ ఫ్యాంటే కాపాడింది. జర్మనీకి చెందిన అర్నె మూర్కె అనే 30 ఏళ్ల వ్యక్తి  తన సోదరుడితో కలిసి పసిఫిక్ మహా సముద్రంలో..పడవలో ఆక్లాండ్ నుంచి బ్రెజిల్‌కు బయల్దేరాడు. న్యూజిలాండ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన తర్వాత గాలులు తీవ్రంగా వీచాయి. దీంతో ముర్కెను సముంద్రంలో పడిపోయాడు.ముర్కెను రక్షించేందుకు లైఫ్ జాకెట్‌ను నీటిలోకి విసిరాడు అతని సోదరుడు. అది అతనికి అందలేదు. అలల తాకిడి చాలా దూరం కొట్టుకుపోయాడు. ఈ ఘటన న్యూజిలాండ్ తూర్పు తీరంలోని తొలగ బేకు 20 మైళ్ల దూరంలో జరిగింది. 
Read Also : ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ…పంజా విసిరిన చిరుత

అలా సముద్రంలో కొట్టుకుపోతున్న ముర్కె ఓ ఐడియా వచ్చింది.  కిటుకు గుర్తుకొచ్చింది. వెంటనే తను వేసుకున్న  జీన్స్ ఫ్యాంట్‌ను విప్పి దాన్ని లైఫ్ జాకెట్‌లా మలచుకున్నాడు. అలా మూడున్నర గంటల సేపు సముద్రంలో మునిగిపోకుండా శతవిధాలా యత్నిస్తు..తన ప్రాణాలను రక్షించుకున్నాడు. జీన్స్ ఫ్యాంట్‌ను లైఫ్ జాకెట్‌గా ఎలా ఉపయోగించగలరు? అది కూడా క్లాతే కదా అని అనుమానం వస్తుంది కదా..నీటిలో తడిచిన జీన్ క్లాత్ మునిగిపోదా అనే కదా మీ అనుమానం. అదీ కరక్టే. ఇక్కడే తన ఐడియాను ఉపయోగించాడు ముర్క్. జీన్స్ ఫ్యాంట్‌‌కు ఉండే రెండు కాళ్ల చివర్లను ముడి వేసి అందులోకి గాలి చొప్పిస్తే బుడగలా మారి అది లైఫ్ జాకెట్‌లా మారుతుంది. అది కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. అయితే, పదే పదే గాలిని చొప్పిస్తూ ఎంతసేపైనా దాని సాయంతో నీటిలో తేలవచ్చు. జీన్స్ ఫ్యాంట్‌ను లైఫ్ జాకెట్‌‌గా ఉపయోగించే విధానాన్ని ఈ వీడియోలో చూడండి. ఎప్పుడన్నా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు పనిచేస్తుందేమో కదూ.
Read Also : వాట్సాప్‌లో కొత్త బగ్ : యూజర్ల ఫొటోలు డిలీట్ చేస్తోంది

ముర్రె సముద్రంలో మునిగిపోతున్న సమాచారాన్ని ముర్కె సోదరుడి ద్వారా  అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే హెలికాప్టర్లతో సముద్రంలో గాలించగా..ఎట్టకేలకు సముద్ర అలలపై తేలుతున్న ముర్రెను చూసినవారు రక్షించారు. ఈ వీడియోను ముర్రె ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. 

కుమార్తెపై ప్రేమే నన్ను కాపాడింది..
సముద్రంలో పడిన తర్వాత తాను ప్రాణాలతో బయటపడటం కష్టమని అనుకున్నాననీ..అప్పుడు తన 10 సంవత్రాల కుమార్తె తనకు గుర్తుకొచ్చిందనీ..తండ్రిలేని కూతురుగా ఆమె జీవించకూడదని బలంగా కోరుకున్నా. ఆ తపనే నన్ను బతికేలా చేసిందనీ ముర్కె తెలిపాడు. ఆ సమయానికి నేను జీన్స్ ధరించి ఉండకపోతే ఈ రోజు ఇలా కనిపించేవాడిని కాదేమో’’ అన్నాడు ముర్కె.