ట్రంప్ కు WHO చురకలు : రాజకీయాలు మాని…వైరస్ పై యుద్ధం చేయాలి

వైరస్‌తో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)డైరక్టర్ జనరల్… డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని,ఇందువల్లే అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేసిన నేపథ్యంలో..బుధవారం టెడ్రస్ మీడియాతో మాట్లాడారు.
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని టెడ్రస్ విజ్ఞప్తి చేశారు. మీ ప్రజల క్షేమం గురించి మీరు ఆలోచిస్తే, పార్టీలు, ఐడియాలజీలకు అతీతంగా పనిచేయాలని, ఇది రాజకీయ పార్టీలకు ఇస్తున్న సందేశమని టెడ్రోస్ తెలిపారు. చైనానాలో వైరస్ ప్రబలుతున్న విషయాన్ని తాము ముందుగానే చెప్పామని, గురువారంతో ఆ విషయాన్ని వెల్లడించి 100 రోజులు పూర్తి అవుతుందని టెడ్రోస్ అన్నారు.
అయితే మంగళవారం విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ… WHO కి ఖర్చు చేసే డబ్బులను ఆపేస్తామని ట్రంప్ అన్నారు. చైనాతో చాలా సన్నిహితంగా WHO ఉంటోందని, అమెరికా దగ్గర డబ్బులు తీసుకుని, చైనాకు చేరువవుతోందని ట్రంప్ విమర్శించారు.క రోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను టెడ్రోస్ కొట్టిపారేశారు. నిందారోపణలు విడిచిపెట్టి కరోనా వైరస్‌ఫై పోరాటంలో చైనాతో కలిసి పనిచేయాలని అమెరికాను టెడ్రోస్ కోరారు. డబ్ల్యూహెచ్‌వో మేనేజ్‌మెంట్‌ను ఆయన సమర్థించుకున్నారు. ఈ ప్రమాదకరమైన శత్రవుపై యుద్ధం చేయాలంటే అమెరికా, చైనా ఒకటి కావాలన్నారు. జెనివాలో జరిగిన మీడియా సమావేశంలో టెడ్రెస్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడే అంశంపైనే రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం ఉండాలన్నారు. వైరస్‌ను రాజకీయం చేయవద్దు అన్నారు. ఇక జనం చావకూడదు అని మీరనుకుంటే, వైరస్‌పై వెంటనే రాజకీయ ఆరోపణలు మానేయాలని ట్రెడెస్ తెలిపారు.