William H Mumler : ఆత్మలను ఫోటో తీసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తులు ఆత్మగా మారతారని నమ్ముతారు. అయితే వాటికి ఫోటోలు తీస్తారట. ఆత్మలకు ఫోటోలు తీసిన మొదటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

William H Mumler : ఆత్మలను ఫోటో తీసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

William H Mumler

Updated On : October 27, 2023 / 5:11 PM IST

William H Mumler : ఆత్మలకు ఫోటోలా? ఆశ్చర్యపోతున్నారా? విలియం హెచ్ ముమ్లెర్ ఆత్మలకు ఫోటోలు తీసిన మొదటి వ్యక్తి. అతనెవరు? అతనికి ఇది ఎలా సాధ్యమైంది? చదవండి.

Ghost : బాయ్‌ఫ్రెండ్ కత్తితో పొడిచి చంపబోతే, దెయ్యం వచ్చి కాపాడిందట .. దెయ్యానికి ధన్యవాదాలు చెబుతున్న టీచర్

స్పిరిట్ ఆఫ్ ఫోటోగ్రఫీ.. చనిపోయిన ఆత్మల ఫోటోలను తీయడానికి ప్రయత్నించే ఒక రకమైన ఫోటోగ్రఫీ. 19 వ శతాబ్దంలో ఇది చాలా ప్రజాదరణ పొందింది. విలియం హెచ్ ముమ్లెర్ ఆత్మలకు ఫోటోలు తీసిన మొట్టమొదటి వ్యక్తి. అతను నగలను తయారు చేసేవాడట. అంతేకాదు ఫోటోగ్రఫీ అంటే మక్కువ ఉండటంతో ఫోటోలు తీస్తుండేవాడట. 1862 లో అతను అనుకోకుండా తీసిన ఓ చిత్రంలో ఒక వ్యక్తి వెనుక చనిపోయిన అతని బంధువు ఆత్మను చూపించిందిట. ఈ ఫోటో తర్వాత అతను ఆత్మలకు ఫోటోలు తీయడం మొదలుపెట్టాడట. దీంతో అతనికి లాభదాయకమైన వ్యాపారంగా మారిందట.

ముమ్లెర్ తీసిన ఫేమస్ ఫోటోలలో మేరీ టాడ్ లింకన్ ఆమె భర్త అబ్రహం లింకన్ ఆత్మతో ఉన్నట్లు గిన్నిస్ బుర్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా నివేదించింది. Ghosts caught on Film అనే పుస్తకం ప్రకారం ఆ ఫోటోలో ఆత్మ లింకన్ అని ముమ్లర్‌కి తెలియదట. ఫోటో డెవలప్ చేసేవరకు కూడా అది ఎవరో గుర్తించలేదట.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

అయితే ముమ్లెర్‌పై అనేక వివాదాలు ఉన్నాయి. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ యొక్క నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీలో అమెరికన్ మత చరిత్ర యొక్క క్యూరేటర్ పీటర్ మాన్సో, ముమ్లెర్ ఒక మోసగాడు అని చెప్పాడు. అలాగే అంతర్యుద్ధంలో తన సోదరుడిని కోల్పోయిన ఒక మహిళ కోసం ముమ్లర్ ఆమె సోదరుడి ఆత్మ ఫోటోను తీసాడు. అయితే ఆమె సోదరుడు ఇంటికి రావడంతో ముమ్లర్ మోసం చేసాడని ఆ మహిళ ఆరోపించిందట.