Cool drink in commode : కమ్మోడ్‌లో కూల్ డ్రింక్ తయారు చేసి..పార్టీలో గెస్ట్ లకు ఇచ్చిన యువతి..ఈ పంచ్ కిక్ ఇచ్చిందా? అంటూ పరాచికాలు

Cool drink in commode : కమ్మోడ్‌లో కూల్ డ్రింక్ తయారు చేసి..పార్టీలో గెస్ట్ లకు ఇచ్చిన యువతి..ఈ పంచ్ కిక్ ఇచ్చిందా? అంటూ పరాచికాలు

Woman Makes Party Drink In Toilet Bowl, Serves It To Friends.

Updated On : April 29, 2021 / 4:03 PM IST

Cool drink made in commode : ఆటపట్టించడానికి సరదాలు చేయటానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అవే శృతి మించితే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో రోత పుట్టించి వాంతి తెప్పిస్తోంది. అదేంటే హల్ చల్ అంటాం కదా..వాంతి తెప్పించటమేంటీ అనే డౌట్ రావచ్చు. ఈ వీడియో చూస్తే వాంతే కాదే ఇంకేమన్నా వస్తాయిమరి. అంతేకాదు తలచుకుంటేనే అసహ్యం వేస్తుంది. కానీ.. కొందరికి ఇవ్వన్నీ పట్టవు. సోషల్ మీడియా హ్యాంగోవర్ లో పడి పిచ్చి పిచ్చి పనులు..వెర్రి మొర్రి వేషాలు వేస్తుంటారు.

ఓ యువతి పార్టీ ఇస్తున్నాను రమ్మని ఫ్రెండ్స్ ని పిలిచింది. అసలే కరోనా గోలతో పరమ బోర్ కొట్టేసి ఎక్కడికన్నా వెళితే బాగుండు అనుకున్న సమయంలో ఆమె పార్టీ అని పిలిచేసరికి భలే అనిపించి చాలామందే స్నేహితులే వచ్చారు. అలా వచ్చినవారికి చక్కగా రకరకాలుగా వండిపెట్టతాం. కానీ ఈమెగారు మాత్రం ఫుల్ డిఫరెంట్. ఎవరైనా కూల్ డ్రింక్స్ ఇస్తారు. అలాగే ఈమె కూడా కూల్ డ్రింక్ ఇచ్చింది ఫ్రెండ్స్ కి.

కానీ ఆ ఇచ్చిన డ్రింక్ ను బాత్రూమ్ కమ్మోడ్ లో తయారు చేసిన డ్రింక్ అది. కమ్మోడ్‌లో తయారు చేసిన కూల్ డ్రింక్ పార్టీకి వచ్చిన వారికి దీన్ని సర్వ్ చేసింది. తాను ఎలా చేసిందో చెబితే కిక్ ఏముంది? నా మొహాన్నే ఉమ్మేస్తారు అనుకుంది. ఇచ్చిన డ్రింకును వాళ్లు తాగుతుంటూ తెగ ఎంజాయ్ చేస్తూ చూసింది. భలే భలే తాగుతున్నారు అనుకుని తెగ సరదా పడిపోయింది.

ఆమెగారు చేసిన అరాచకపు డ్రింక్ అని తెలియనివారు పాపం ఆమె ఇచ్చిన కూల్ డ్రింక్‌ను టేస్ట్ చేశారు. కానీ అసలు విషయం బైటపడనే పడింది. అంతే అందరూ ఒక్కసారిగా షాక్..షాక్..షాక్..వారిలో ఒకరికి విషయం తెలియడంతో మ్యాటర్ మొత్తం బయటపడిపోయింది. తాము తాగింది ఎలా చేసిన డ్రింకో తెలిసి తెగ కక్కుకున్నారు. నోట మాట రాకుండా బిగుసుకుపోయారు. ఆ సమయంలో వారి ఫీలింగ్స్ చెప్పటానికి ఏ మాటలు సరిపోవనే చెప్పాలి. రకరకాల ఎక్స్ ప్రెషన్స్. అది సరిపోదున్నట్లుగా ఆమెగారు పార్టీ అయిపోయాక వారి ఫొటోలను, కమ్మోడ్‌లో కూల్ డ్రింక్ తయారు చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ‘‘పార్టీల్లో కిక్కిచ్చే మంచి పంచ్ ట్రిక్..దుమ్మురేపేయచ్చు’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతూ.. నెటిజన్లకు రోత పుట్టిస్తోంది. వీడియోలో ఏం ఉందో మీరు చూడండీ..