Wow నమస్తే ట్రంప్ : ఆశ్చర్యపోయిన ట్రంప్ సహాయకుడు

  • Published By: madhu ,Published On : February 24, 2020 / 08:49 AM IST
Wow నమస్తే ట్రంప్ : ఆశ్చర్యపోయిన ట్రంప్ సహాయకుడు

Updated On : February 24, 2020 / 8:49 AM IST

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్..భారతదేశంలో అడుగు పెట్టారు. ఈయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ట్రంప్..ప్రపంచం గుర్తు పెట్టుకొనే విధంగా భారీ సన్నాహాలు జరిగాయి. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిగింది. రోడ్డుకిరువైపులా ప్రజలు నిలబడి ఘన స్వాగతం పలికారు. డప్పులు, వాయిదాలు, నృత్యాలు చేస్తూ…సంప్రదాయ బద్ధమైన వస్త్రాలు ధరించారు. 

అయితే..ఈ ఏర్పాట్లు చూసిన…ట్రంప్ సహాయకుడు డాన్ స్కావినో..ఆశ్చర్యపోయారంట. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి..ట్రంప్ కాన్వాయ్ బయలుదేరింది. అందులో డాన్ కూడా ఉన్నారు. రోడ్డుకిరువైపులా లక్షల మంది ట్రంప్‌కు వెల్ కం చెబుతూ కనిపించడం చూశారు. ఈ దృశ్యాలు చూసిన ఆయన విస్మయానికి గురయ్యారు. వావ్ అంటూ సంభ్రమాశ్చార్యాలు వ్యక్తం చేశారు.

నమస్తే ట్రంప్‌కు ఇంతటి విశేషాదరణ! అంటూ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ట్రంప్ భారత పర్యటనపై అక్కడ పలు ప్రకటనలు వెలువెరించారు. అంచనాలకు మించి..ఘనమైన స్వాగతం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా..పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.