Jimmy Donaldson : 1000 మంది అంధులకు సాయం చేసిన యూట్యూబర్.. చివరికి తనకు

వేలాదిమంది అంధులకు కంటి చికిత్స కోసం సాయం చేసిన యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్ తాను ఇప్పుడు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు ట్వీట్ చేసారు. అసలు ఎవరు ఈ జిమ్మీ డొనాల్డ్‌సన్?

Jimmy Donaldson : 1000 మంది అంధులకు సాయం చేసిన యూట్యూబర్.. చివరికి తనకు

Jimmy Donaldson

Updated On : February 3, 2024 / 9:21 AM IST

Jimmy Donaldson : జిమ్మీ డొనాల్డ్‌సన్ తన యూట్యూబ్ ఛానెల్ మిస్టర్ బీస్ట్‌తో చాలా పాపులర్. సాహసోపేతమైన వీడియోలతో పాటు తన దాతృత్వాన్ని చాటుకునే వీడియోలతో అతను చాలా ఫేమస్ అయ్యాడు. గతేడాది 1000 మంది దృష్టి లోపం ఉన్నవారికి సాయం చేసిన జిమ్మీ తాను ఇప్పుడు కంటి చూపు లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు.

Anand Mahindra : మీరు ఇలా తయారు చేయగలరా? నేను పెట్టుబడి పెడతా..! ఆనంద్ మహీంద్ర ట్వీట్.. వీడియో వైరల్

ఇటీవల కాలంలో చాలామంది యూట్యూబర్లు తాము సంపాదించే డబ్బులో కొంత సేవా కార్యాక్రమాలకు వినియోగిస్తున్న వీడియోలు అనేకం చూస్తున్నాం. అయితే జిమ్మీ డొనాల్డ్‌సన్ అనే యూట్యూబర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 236 మిలియన్ల కంటే పైగా సబ్ స్క్రైబర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ ఛానెల్‌తో చాలా పాపులర్ అయిన ఇతను సేవా కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది జిమ్మీ 1000 మంది అంధుల కంటి చికిత్సకు కావాల్సిన ఆర్ధిక సాయం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. మెక్సికో, నమీబియా, వియత్నాం, బ్రెజిల్, ఇండోనేషియా వంటి ఎనిమిది దేశాల్లో ప్రజలకు కంటి చికిత్సల కోసం మిస్టర్ డొనాల్డ్ సన్ $100000 (ఇండియన్ కరెన్సీలో 82,99,955) విరాళం ఇచ్చినట్లు తన వీడియోలో చూపించాడు. చికిత్స పొందిన తర్వాత చూపు నయం అయన వారంతా ఎమోషనలౌతూ కనిపించారు.

Hyderabad : ప్రొఫెషనల్స్ కోట.. అమీర్‌పేట.. వైరల్ వీడియో

తాజాగా జిమ్మీకి కంటి సమస్య మొదలైందట. ఆస్టిగ్మాటిజంతో బాధపడుతున్నాడట. చూపు స్పష్టంగా లేదని.. కళ్లజోడు పెట్టుకుంటున్నానని స్వయంగా తన ట్వీట్‌లో వెల్లడించాడు జిమ్మీ. గతంలో 1000 మంది బధిరులకు, 2000 మంది అంగవైకల్యంతో బాధపడుతున్నవారికి కూడా జిమ్మీ సాయం అందించాడు. తాజాగా తాను కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లు ట్వీట్ చేయడంతో పాటు గతేడాది తాను సాయం చేసిన వీడియోను పోస్టు చేస్తూ ‘ఈ వీడియోలో నాకు నేను కూడా సాయం చేసుకోవాల్సింది’ అని చమత్కరిస్తూ పోస్టు చేసారు. జిమ్మీడొనాల్డ్‌సన్ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.