200 కి.మీటర్ల దూరంలో..తెలంగాణపై మిడతల దండు

తెలంగాణ రాష్ట్రంపై మిడతల దండు దాడి చేస్తుందా ? తమ పంటలను నాశనం చేస్తుందా ? పొరుగున ఉన్న రాష్ట్రలో ఈ మిడతల దండు చేస్తున్న దాడులను చూస్తున్న రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మిడతల దండు దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు రెడీ అయ్యారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ పలు ప్రాంతాలతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మిడతలు దాడి చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాలతో పలు ఏరియాల్లో సర్వే చేశారు.
ఆదిలాబాద్, కొమరంభీం–ఆసిఫాబాద్, కొమరంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో అధికారులు పురుగుల మందులతో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు 15 వేల లీటర్ల మెలాథియన్, క్లోరోఫైరోపోస్, లాంబ్డా సహాలాత్రిన్‌ను అందుబాటులో ఉంచారు. ఒకవేళ మహరాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దుల ప్రాంతాల్లో రసాయనాలు పిచికారి చేసేందుకు జెట్టింగ్ యంత్రాలతో రెడీగా ఉన్నారు.
తూర్పు ఆఫ్రికా నుంచి బయలుదేరిన ఈ మిడతల దండు…భారత్ కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్ పూర్ వద్ద మిడతల దండు ఉందని అధికారులు గుర్తించారు. తెలంగాణకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఈ దండు నాగ్ పూర్, గోండియా జిల్లాలోని బత్తాయి తోటలపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు.
దండు తెలంగాణలోకి ప్రవేశిస్తే..ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన..ఐదుగురు సభ్యుల బృందం తన నివేదికను సీఎస్ కు 2020, జూన్ 17వ తేదీ బుధవారం అందచేయనుంది. ఈ దంండు ఇప్పట్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశమే లేదని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం.
Read: తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు