ఏపీలో 24 గంటల్లో 36 కరోనా కేసులు 

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 06:52 AM IST
ఏపీలో 24 గంటల్లో 36 కరోనా కేసులు 

Updated On : October 31, 2020 / 2:35 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్-19 పరీక్షల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసుల్లో 1192 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 48 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860మందిగా ఉన్నారు. ఏపీలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో నెల్లూరులో 12, చిత్తూరులో 8, పశ్చిమ గోదావరిలో ఒకటి కోయంబేడు (తమిళనాడు) నుంచి 21 మంది వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి నమోదైన పాజిటివ్ కేసుల్లో మొత్తం 105 మంది ఉండగా వారిలో ఒడిషాలో 10 మంది, మహారాష్ట్ర 67మంది, గుజరాత్ 26 మంది, కర్ణాటక 1, పశ్చిమ బెంగాల్ 1 చొప్పున ఉన్నారు. 

గడిచిన 24 గంటల్లో 50 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. గుంటూరులో 21 మంది, కర్నూలులో 19 మంది, అనంతపూర్‌లో 3 మంది, చిత్తూరులో 3 మంది, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 1192కి చేరిందన్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒకరు మరణించారు. ఇప్పటివరకూ కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 48కి చేరింది. 

Read Here>> ఏపీలో కరోనా @ 2137 : కొత్త కేసులు 48