వారి కోసం బిచ్చమెత్తుతా ప్రకాష్ రాజ్ ట్వీట్

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 01:13 AM IST
వారి కోసం బిచ్చమెత్తుతా ప్రకాష్ రాజ్ ట్వీట్

Updated On : May 17, 2020 / 1:13 AM IST

ప్రకాష్ రాజ్ బిచ్చమెత్తడం ఏంటీ ? ఇదంతా ఎవరి కోసం చేస్తారు ? అని అనుకుంటున్నారు. సినిమా, ఇతర రంగాల్లో నటించే వారిలో మానవత్వం కూడా దాగి ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకొస్తుంటారు. ఏదైనా ఆపద సంభవించినప్పుడు..ప్రభుత్వాలకు తోచిన విధంగా సహాయం చేస్తుంటారు.

సినిమా రంగంలో విలక్షణ నటుడిగా పేరొందిన…ప్రకాష్ రాజ్..కూడా తోచిన విధంగా సహాయం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధించడంతో ఎంతో మంది కష్టాల పాలవుతున్నారు. ప్రధానంగా వలస కూలీలు, కార్మికులు పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

వీరిని ఆదుకొనేందుకు ప్రకాష్ రాజ్ తన ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. వలస కార్మికులు రోడ్లపై ఉన్నారని, వీరి కోసం తాను బిక్షాటన చేయడానికి సిద్ధమని…లేకపోతే అప్పు తీసుకుంటానన్నారు. వీరు..తిరిగి తనకు ఏమీ ఇవ్వరనే విషయం తనకు తెలుసని, కానీ ఇంటికి వెళ్లిన తర్వాత…ఓ వ్యక్తి ఇంటికి చేర్చేందుకు సహాయం చేశాడని, తమకు శక్తిని ఇచ్చాడని అనుకుంటే చాలన్నారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా..పేదలకు వివిధ రూపాల్లో సహాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, ఆహారం పంపిణీ చేస్తున్నారు. కొంతమంది నిరాశ్రయులకు ఫాం హౌస్ లో ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తోందని ఇటీవలే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా..సరే పేదలకు సాయం చేస్తా..కావాలంటే మళ్లీ సంపాదించకోగలను అంటున్నారు ప్రకాష్ రాజ్.