Odisha Cabinet reshuffle: ఒడిశా మంత్రులు అందరూ రాజీనామా

Odisha Cabinet reshuffle: ఒడిశా కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు అందరూ రాజీనామా చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. దీంతో మంత్రులు అందరూ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులు అందరినీ రాజీనామా చేయాలని నవీన్ పట్నాయక్ కోరడం ఇదే తొలిసారి. రేపు ఉదయం 11.45 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ గణేశీ లాల్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.
Uttar Pradesh Violence: రాష్ట్రపతి, ప్రధాని పర్యటన రోజే హింస జరగడం దురదృష్టకరం: మాయావతి
యువ నేతలకు నవీన్ పట్నాయక్ మంత్రులుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 2024లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 2000, మార్చి 5 నుంచి కొనసాగుతున్నారు. దీంతో సాధారణంగా ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆయన కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు.
Asaduddin Owaisi: మోహన్ భగవత్ కాదు.. మోదీ భరోసా ఇవ్వాలి: అసదుద్దీన్ ఒవైసీ
బ్రజ్‌రాజ్‌నగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇటీవల నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీ పార్టీ గెలుపొందింది. ఆ వెంటనే ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీయే విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా ఉండేందుకు నవీన్ పట్నాయక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.