Ananya Nagalla: ఫోటోషూట్స్ తో రెచ్చిపోతున్న తెలుగమ్మాయి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలో ముగ్గురు బాధిత యువతులది కీలక పాత్ర. కథ మొత్తం ఈ పాత్రల చుట్టూనే తిరిగే ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు మరో ఇద్దరు తెలుగు భామలున్నారు. అంజలి ఇప్పటికే నటిగా.. తనదైన బాష, యాసలో కూడా అదరగొట్టగలదని నిరూపించుకోగా..

Ananaya Nagalla Exciting Photo Shoot Goes Viral
Ananya Nagalla: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలో ముగ్గురు బాధిత యువతులది కీలక పాత్ర. కథ మొత్తం ఈ పాత్రల చుట్టూనే తిరిగే ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు మరో ఇద్దరు తెలుగు భామలున్నారు. అంజలి ఇప్పటికే నటిగా.. తనదైన బాష, యాసలో కూడా అదరగొట్టగలదని నిరూపించుకోగా.. అనన్య నాగళ్ళ అనే మరో నటి కూడా వెలుగులోకి వచ్చింది. అనన్య అప్పటికే మల్లేశం, ప్లే బ్యాక్ సినిమాలలో నటించగా వకీల్ సాబ్ తో మరికాస్త పాపులర్ అయింది.

Ananya Nagalla
సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య వకీల్ సాబ్ తర్వాత మరికాస్త అలెర్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూనే ఫోటోషూట్స్ చేసి తన ఖాతాలలో పోస్ట్ చేస్తుంది. కాస్త గ్లామర్ డోస్ పెంచిన అనన్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కా తెలంగాణ అమ్మాయి అయిన అనన్య న్యాయవిద్యలో పట్టాపొంది నటనపై ఆసక్తితో ఇలా టర్న్ తీసుకుంది. వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులలో ఐడెంటిఫికేషన్ దక్కించుకున్న అనన్య వరస అవకాశాలను పట్టేసి స్టార్ గా ఎదురుగుతుందో లేదో మరి!

Ananya Nagalla