కరోనా ఎఫెక్ట్ : 26 సీట్లే..కొత్తగా ఏపీ బస్సులు

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 04:39 AM IST
కరోనా ఎఫెక్ట్ : 26 సీట్లే..కొత్తగా ఏపీ బస్సులు

Updated On : October 31, 2020 / 2:36 PM IST

కరోనా రాకాసి కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో రాష్ట్రాలు మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇంతే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ తో జీవించాల్సి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ చెబుతూ వస్తూనే..వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా రవాణా వ్వవస్థలో మార్పులు తీసుకరావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందులో ఆర్టీసీ ఒకటి. ముందటలాగా ఉండకుండా..మార్పులు చేయనుంది ఏపీ ప్రభుత్వం. 

కరోనా లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా దాదాపు 50 రోజులకు పైగా ప్రజా రవాణా నిలిచిపోయింది. ఏ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు రోడ్డెక్కలేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సుల సర్వీసులు నిలిపివేశాయి. మే 17 తర్వాత ఏపీలో రోడ్డెక్కేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సుల నిర్వహణకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. బస్సుల్లో రద్దీ ఉండకుండా సీట్లను మార్చివేయాలని ప్రభుత్వం సూచించింది. 

భౌతిక దూరం ఉండే విధంగా సీట్లను రూపొందించారు. మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించారు. విజయవాడ ఆర్టీసీ అధికారులు 26 సీట్ల లగ్జరీ బస్సులను రూపొందించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ప్రయాణం ఎప్పుడు చేయదలుచుకున్నారో..దానికి వారం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. అయితే ఈ మోడల్ ను అధికారులు ఓకే చేబితే..మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా  ఉన్నారని తెలుస్తోంది. 

Read Here>> ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ