MPTC Elections Results : చంద్రబాబు ఇలాకాలో చరిత్ర తిరగ రాసిన అశ్విని

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకాలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగ రాసింది.

MPTC Elections Results : చంద్రబాబు ఇలాకాలో చరిత్ర తిరగ రాసిన అశ్విని

Aswini Kuppam Mptc

Updated On : September 19, 2021 / 5:23 PM IST

MPTC Elections Results : ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకాలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగ రాసింది. టీడీపీ కంచుకోటగా ఉన్నచిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో1989 నుంచి టీడీపీ మినహా మరోపార్టీ అక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. 30సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను తిరగరాస్తూ కుప్పం మండలం టీ సుడుమూరు ఎంపీటీసీ స్ధానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్ధి అశ్వినివిజయం సాధించింది.

అశ్విని 1,073 ఓట్లతో టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో కూడా టీడీపీకి పరాభవం ఎదురైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్ధి వెయ్యి ఓట్లకి పైగా ఆధిక్యంతోవిజయం సాధించారు. దీంతోవైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read : Tirupati Accident : తిరుపతిలో తప్పిన ప్రమాదం