Viral Video: చిన్నారి జిమ్నాస్టిక్స్ చూస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే!
టాలెంట్, ప్రాక్టీస్ ఉండాలే కానీ చేయలేనిది ఏదీ ఉండదు. అవి రెండూ తోడైతే వయసుతో కూడా పనిలేకుండా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ చిన్నారి.

Viral Video
Viral Video: టాలెంట్, ప్రాక్టీస్ ఉండాలే కానీ చేయలేనిది ఏదీ ఉండదు. అవి రెండూ తోడైతే వయసుతో కూడా పనిలేకుండా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ చిన్నారి. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఖాతా ఏదైనా.. ఎక్కడ చూసినా వీడియో, ఆ చిన్నారి గురించే చర్చ. నిండా ఐదేళ్లు కూడా నిండని ఆ చిన్నారి చేసిన జిమ్నాస్టిక్ వర్కవుట్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సినీ, క్రీడా సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను షేర్ చేసి చిన్నారిని ప్రశంసిస్తున్నారు. రిటైర్డ్ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్విట్టర్ లో ఆ చిన్నారి వీడియోను షేర్ చేయగా.. ఒక్క ట్విట్టర్ లోనే ఇప్పటి వరకు 4.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇంత చిన్న వయసులో చిన్నారి ఫిట్నెస్, టాలెంట్ చూసిన నెటిజన్లకు మతిపోతుంది. కొందరైతే ఇది జిమ్నాస్టిక్స్ కాదురా బాబోయ్ ఇది విధ్వంసాన్ని మించిన అరాచకం అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
Humans can do all things if they will. pic.twitter.com/5Ed0YxzaBb
— Virender Sehwag (@virendersehwag) August 16, 2021