Chiranjeevi Charitable Trust : టీవీ ఆర్టిస్టులకు కరోనా వ్యాక్సిన్..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే..

Chiranjeevi Charitable Trust : టీవీ ఆర్టిస్టులకు కరోనా వ్యాక్సిన్..

Chiranjeevi Charitable Trust Has Commenced Vaccination Programme For Tv Artists

Updated On : June 14, 2021 / 6:38 PM IST

Chiranjeevi Charitable Trust: కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన సినీ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. తాజాగా టీవీ ఆర్టిస్టులకు కూడా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం సోమవారం నుండి జరుగుతుంది.

Ccc

టీవీ ఆర్టిస్టులకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు సీసీసీ ముందుకు వచ్చిన సందర్భంగా ప్రముఖ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘‘సీసీసీ ఆధ్వర్యంలో సినిమా కార్మికులు, ఆర్టిస్టులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం విజయవంతగా సాగుతుంది. ఇందులో భాగంగా టీవీ ఆర్టిస్టులకు కూడా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం వర్తింప చేయాలని నేను అన్నయ్య చిరంజీవి గారిని అడిగినప్పుడు అయన వెంటనే ఓకే అన్నారు. ఈ రోజు నుండి టీవీ ఆర్టిస్ట్‌లందరికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన అన్నయ్యకు అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు, సీసీసీ, అపోలో వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా అందరు వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Ccc

టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు వినోద్ బాల మాట్లాడుతూ.. ‘‘మన మెంబర్స్‌కి, మన అసోసియేషన్‌కు వ్యాక్సినేషన్ అవసరం ఉంది. అందుకే నాగబాబు అన్నయకు చెప్పడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయి అన్నయ చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమంలో టీవీ ఆర్టిస్టులు కూడా పాల్గొనేలా చేసినందుకు ముందుగా నాగబాబు అన్నయ్యకు థ్యాంక్స్. అలాగే టీవీ ఆర్టిస్టులకు కూడా వ్యాక్సినేషన్ కల్పించిన చిరంజీవి అన్నయ్యకు థ్యాంక్స్ చెబుతున్నా. టీవీ ఆర్టిస్టులందరు కూడా వ్యాక్సిన్ త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.