CM Jagan : కేంద్ర రైల్వేమంత్రితో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.

CM Jagan : కేంద్ర రైల్వేమంత్రితో సీఎం జగన్ భేటీ

Cm Jagan Meets Piyush Goyal

Updated On : June 11, 2021 / 1:35 PM IST

CM Jagan Meets Piyush Goyal : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిుల, ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ముందుగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.