Constable Molested A Girl : బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి

మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలో భక్షిస్తుంటే స్ధానికులు దేహశుద్ధి చేసి బుద్ది చెప్పిన ఘటన గుంటూరు జుల్లాలో చోటు చేసుకుంది.

Constable Molested A Girl : బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి

Constable Molested

Updated On : August 21, 2021 / 1:27 PM IST

Constable Molested A Girl : మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలో భక్షిస్తుంటే స్ధానికులు దేహశుద్ధి చేసి బుద్ది చెప్పిన ఘటన గుంటూరు జుల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన  రమేష్ అనే  యువకుడు పదేళ్ళకిందట గుంటూరు జిల్లాలో పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. అతని ఇంటికి సమీపంలోని  10 వతరగతి చదివే బాలికతో  రమేష్ కొంతకాలంగా చనువుగా ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ఇంట్లో లేని సమయంలో బాలికను ఇంటికి పిలిచాడు.

బాలిక అతని ఇంట్లోకి వెళ్లటం చూసిన ఆమె బంధువులు కానిస్టేబుల్ రమేష్  ఇంటికి వెళ్లి పరిశీలించగా..కానిస్టేబుల్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించటం చూశారు. కోపోద్రిక్తులైన బంధువులు కానిస్టేబుల్ పైమూకుమ్మడిగా దాడిచేసి దేహశుధ్ధి చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఒకనొక దశలో కోపం పట్టలేక మేడమీదనుంచి కిందకు విసిరివేయటానికి సిధ్దమయ్యారు. ఈ క్రమంలో కొందరు అడ్డుపడటంతో అగిపోయారు. దీంతో  సమీపంలోని  ఏటీ ఆగ్రహారం  పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఎస్సైకి జరిగినదంతా వివరించారు.

కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేస్తే చర్యలు  తీసుకుంటానని ఎస్సై తెలిపారు. కాగా… కేసుపెడితో తర్వాత బాలిక భవిష్యత్తుపాడవతుందనే భయంతోఆమె బంధువులు కేసుపెట్టలేదు. స్టేషన్ ఎస్సై కానిస్టేబుల్ ను ఘటుగా మందలించారు. కానిస్టేబుల్ గురించి ఉన్నతాధికారులకు రిపోర్టు రాయనున్నట్లు తెలిసింది.  ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసు అధికారులు గోప్యంగా ఉంచినప్పటీకీ  జిల్లా ఎస్పీ దృష్టికి  వెళ్ళింది. జిల్లా ఎస్పీ ఆరిఫ్ కానిస్టేబుల్ నుసస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.