Indiaలో కరోనా..6 లక్షల కేసులు..ఒక్కరోజులో 434 మంది మృతి

Indiaలో కరోనా కల్లోలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా..ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా..అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. లాక్ డౌన్ సడలింపులతోనే కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం ఏకంగా ఆరు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2020, జులై 01వ తేదీ బుధవారం ఒక్కరోజే 19 వేల 148 మంది వైరస్ బారిన పడగా…434 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కు చేరుకుంది. 17 వేల 834 మహమ్మారి కాటుకు బలి అయ్యారు. ప్రధానంగా తమిళనాడు,ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు.
ఇదిలా ఉంటే…కేసులు పెరుగుతున్నా…రికవరీలు కూడా అదేస్థాయిలో ఉండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు వ్యాధి సోకిన వారిలో 3 లక్షల 59 వేల 859 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 2 లక్షల 26 వేల 947 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు 60 శాతంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. 1,08,03,599 మందికి వ్యాధి సోకగా..5,18,968 ప్రాణాలు కోల్పోయారు. 64,57,985 మంది కోలుకున్నారు. 43,45,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 52,898 మందికి పాజిటివ్ అని తేలింది.
Read:బ్లడ్ టెస్టు చాలు.. మీపై కరోనా తీవ్రత ఎంత ఉందో చెప్పేస్తుంది!