Curry Leaves : రక్తహీనత పోగొట్టి, శరీరంలో కొవ్వు స్ధాయిలను తగ్గించే కరివేపాకు!
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తుంది.
Curry Leaves : కూరల్లో రుచి, సువాసన కోసం కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకును రోజువారిగా ఉపయోగించని ఇల్లంటు ఉండదు. ప్రతి ఇంట్లో అనునిత్యం దీనిని వాడుకోవాల్సింది. కరివేపాకులో అనేక ఔషధగుణాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, క్యాల్షియం, పాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్లు కరివేపాకులో పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తుంది. రోజూ నాలుగు పచ్చి కరివేపాకుల్ని తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గుతాయని అధ్యయనాల్లో తేలంది. రోజూ తినే ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల వయసు పెరిగిన తరవాత వచ్చే క్యాటరాక్ట్ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేందుకు కరివేపాకులోని పీచు సహకరిస్తుంది. అజీర్తి సమస్యలతో బాధపడేవారు గ్లాసు మజ్జిగలో చిటికెడు ఇంగువ, కరివేపాకు, సోంపు కలిపి తాగితే సమస్య దూరమవుతుంది. శరీరానికి చల్లదనం కూడా అందుతుంది. కరివెపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలోయిడ్లలో అతిసారాన్ని నివారించవచ్చు. కరివేపాకులోని టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించటంలో తోడ్పడతాయి.