‘సలార్’లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్..

  • Published By: sekhar ,Published On : December 4, 2020 / 06:17 PM IST
‘సలార్’లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్..

Updated On : December 4, 2020 / 6:26 PM IST

Prashanth Neel About Salaar: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. డిసెంబర్ 2న టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.


ప్రభాస్ మెషిన్ గన్ పట్టుకుని కూర్చుని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ‘The most violent men… Called him… The most violent’ అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.
‘సలార్’ మూవీకి ప్రభాస్‌నే హీరోగా తీసుకోవడానికిగల కారణాలు ఏంటనేవి తాజాగా వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

Salaar

‘‘సలార్’ టైటిల్‌కు రకరకాల అర్థాలు చెబుతున్నారు. నిజానికి అది ఒక ఉర్దూ పదం. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌నే ఎందుకు తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారు. నా కథకు ప్రభాస్ పర్ఫెక్ట్‌గా సరిపోతాడు. అమాయకంగా ఉండే వ్యక్తి, కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడనేది ‘సలార్’ సినిమాలో చూపించబోతున్నా.

https://10tv.in/rebel-star-prabhas-salaar/

అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్. అందుకే తనను హీరోగా ఎంచుకున్నాను’’ అని ప్రశాంత్ నీల్ చెప్పారు.
భారీ బడ్డెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘సలార్’ షూటింగ్‌ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.