Ghmc Corporators: జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు ప్రధాని పిలుపు

జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

Ghmc Corporators: జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు ప్రధాని పిలుపు

Ghmc Corporators

Updated On : June 5, 2022 / 8:46 PM IST

Ghmc Corporators: జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పదాదికారులు కూడా మోదీతో సమావేశానికి హాజరవుతారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ కార్పొరేటర్లను ఢిల్లీ తీసుకుని వెళ్తారు. కార్పొరేటర్లు ప్రధానిని కలిసే అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు.

Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయంతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పటికీ, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కలవలేకపోయారు. వర్షం కారణంగా మోదీ సమయం కేటాయించడం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, కార్పొరేటర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్లంతా ఢిల్లీ వెళ్లనున్నారు.