గ్రేటర్ ఎన్నికల ఫలితాలు…. పాతబస్తీలో 13 డివిజన్లలో ఎంఐఎం గెలుపు

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 02:27 PM IST
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు…. పాతబస్తీలో 13 డివిజన్లలో ఎంఐఎం గెలుపు

Updated On : December 4, 2020 / 3:00 PM IST

GHMC election results : గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. 13 డివిజన్లలో విజయం సాధించింది. టోలీచౌకీలో అయేషా, నానల్ నగర్ లో నసీరుద్దీన్, సంతోష్ నగర్ లో ముజాఫర్ హుస్సేన్, రియాసత్ నగర్ లో ముస్తాఫా బేగ్, దూద్ బౌలిలో మహ్మద్ సలీమ్, రాంనాస్ పురాలో రాజ్ మోహన్ విజయం సాధించారు.



చంద్రాయణగుట్టలో అబ్దుల్ వాహబ్, పత్తర్ గట్టిలో సోహై ఖాద్రి, బార్కాస్ లో షబానా బేగం, అహ్మద్ నగర్ లో సుల్తానా, డబీర్ పురాలో అలందార్ హుస్సేన్, మెహిదీపట్నంలో మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. గతంలో మాజిద్ హుస్సేన్ జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు.



టీఆర్ఎస్ 4, క్రాంగ్రెస్ 1, బీజేపీ 1 డివిజన్లలో గెలుపొందాయి. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ ఎస్ 57, ఎంఐఎం 33, బీజేపీ 32, కాంగ్రెస్ 2 డివిజన్ లో ఆధీక్యంలో కొనసాగుతున్నాయి.