Godavari Flood : పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి-భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో  గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది.

Godavari Flood : పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి-భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

bahdrachalam godavari

Updated On : August 9, 2022 / 6:06 PM IST

Godavari Flood :  రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో  గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం మద్యాహ్నానికి 41.2 అడుగులు  దాటింది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరగటంతో స్నాన ఘట్టాల వద్దకు నీరు చేరింది.   మంగళవారం సాయంత్రానికి ఈ నీటి మట్టం 43 అడుగులకు  పెరగటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు రాష్ట్రంలో మరో  2,3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది.  అదే సమయంలో గోదావరి పరీవాహాక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని  తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. గత నెలలో కురిసిన వర్షాలతో భద్రాచలం అతలాకుతలం అయ్యింది. కాగా భద్రాచలం వద్ద ఈ రోజు రాత్రికి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read : MP Rammohan Naidu : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతోంది-రామ్మోహన్ నాయుడు