తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమాయత్తం అవుతోంది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

Updated On : March 9, 2021 / 10:56 AM IST

good news for tirumala devotees: తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమాయత్తం అవుతోంది.

కరోనా సమయంలో శ్రీవారి దర్శనం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులకు మళ్లీ టీటీడీ అనుమతి ఇచ్చింది. జూన్ 8 నుంచి ఆంక్షల నడుమ శ్రీవారి దర్శనాలు మొదలయ్యాయి. తొలుత రోజూ 6వేల మందికి మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించింది టీటీడీ. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గడంతో క్రమంగా భక్తుల సంఖ్య పెరిగింది.

వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే టీటీడీ నిత్యం 55 నుంచి 57వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందులో 22వేల వరకు ఉచిత దర్శనం టోకెన్ల భక్తులు ఉన్నారు. మిగిలిన వారు రూ.300 ప్రత్యేక దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లు కొనుగులో చేసిన భక్తులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శంచుకుంటున్నప్పటికి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది.

టీటీడీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రజలందరికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కావడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత పెంచడానికి టీటీడీ సిద్ధమవుతోంది. సర్వదర్శనం భక్తుల సంఖ్య పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. సర్వదర్శనం భక్తుల సంఖ్యలో 22వేల నుంచి 40వేలకు పెంచాలని భావిస్తోంది. దీంతో శ్రీవారిని రోజూ దర్శించుకునే భక్తుల సంఖ్య 80 నుంచి 85వేలకు పెరగనుంది.

పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం టీటీడీని ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాకట నుంచి ఎక్కువమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీరి నుంచి టీటీడీ ఉద్యోగులకు, తోటి భక్తులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, అధికారులు భావిస్తున్నారు. దీంతో వైరస్ ఉద్యోగులకు సోకుకుండా ఉండేందుకు కొండపైనున్న ఉద్యోగులు, సిబ్బందికి టీకాలు వేయిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో సిబ్బంది కూడా స్వచ్చందంగా పాల్గొంటున్నారు.