Haldibari-Chilahati : 50ఏళ్ల తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ రైలు ప్రారంభం

భారత్-బంగ్లాదేశ్ మధ్య దాదాపు అర్ధ శతాబ్దం (50ఏళ్లు) తర్వాత గూడ్స్ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ ఉదయం 10.30గంటలకు బంగ్లాదేశ్‌కు ప్రయాణం ప్రారంభించింది.

Haldibari-Chilahati : 50ఏళ్ల తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ రైలు ప్రారంభం

First Goods Train From India To Bangladesh

Updated On : August 2, 2021 / 11:16 AM IST

First Goods Train from India to Bangladesh : భారత్-బంగ్లాదేశ్ మధ్య దాదాపు అర్ధ శతాబ్దం (50ఏళ్లు) తర్వాత గూడ్స్ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ ఉదయం 10.30గంటలకు ఆగస్టు1,2021 ఓ గూడ్స్ రైలు మన సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌కు ప్రయాణం ప్రారంభించింది. పునరుద్ధరించిన హల్దిబాడీ-ఛిలహతి మార్గాన్ని 17 డిసెంబరు 2020న భారత ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు.

కరోనా కారణంగా ఈ మార్గంలో ఇప్పటి వరకు అధికారికంగా రైలు సేవలు ప్రారంభం కాలేదు. ఈక్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దివార్ జిల్లాలోని దిమ్‌దిమ స్టేషన్ నుంచి ఉదయం పదిన్నర గంటలకు బంగ్లాదేశ్‌కు గూడ్స్ రైలు ప్రయాణం మొదలైంది. ఇది బల్దిబరి మీదుగా బంగ్లాదేశ్‌లోని ఛిలహతికి చేరుకుంటుంది. గతంలో ఈ మార్గంలో 1965 వరకు రవాణా జరిగింది.58 వ్యాగన్లతో కూడా స్టోన్ చిప్స్ లోడుతో ఈ రైలు బయలుదేరింది. బల్దిబరి మీదుగా బంగ్లాదేశ్‌లోని ఛిలహతికి చేరుకోనుంది.

ఈ మార్గం రెండు దేశాల మధ్య ముఖ్యంగా అస్సాం, బెంగాల్, నేపాల్ మరియు భూటాన్ నుండి బంగ్లాదేశ్‌కు వస్తువుల రవాణాకు అతి తక్కువ మార్గం అవుతుంది. ఇది దక్షిణ ఆసియా దేశాలతో సహా ఈ ప్రాంతంలో ప్రాంతీయ వాణిజ్యం మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధికి కొత్త జీవితాన్ని అందిస్తుంది.