Surya-Karthi: తమిళ హీరో సూర్య దీపావళి వేడుకలో.. టాలీవుడ్ హీరో సాంగ్ కి ఫామిలీతో కలిసి స్టెప్పులు వేస్తున్న కార్తీ..
సినీ తారలు మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నపటికీ.. పండగ వస్తే మాత్రం కుటుంబంతో కలిసి సందడి చేస్తారు. ఇక టాలీవుడ్ లో మెగా హీరోస్ అయితే ప్రతి ఫెస్టివల్ కి అందరూ ఒక చోటుకి చేరుకొని సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ కూడా కలిసి ఈ దీపావళిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.

Hero Karthi dance steps with Tollywood hero Song in Diwali celebration
Surya-Karthi: సినీ తారలు మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నపటికీ.. పండగ వస్తే మాత్రం కుటుంబంతో కలిసి సందడి చేస్తారు. ఇక టాలీవుడ్ లో మెగా హీరోస్ అయితే ప్రతి ఫెస్టివల్ కి అందరూ ఒక చోటుకి చేరుకొని సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ దీవాళీని అల్లు అర్జున్ ఇంట జరుపుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Karthi : ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమని ఇస్తున్నారు.. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది..
కాగా కోలీవుడ్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ కూడా కలిసి ఈ దీపావళిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకులకు ఫామిలీ మెంబెర్స్ తో పాటు, నటి రాధికా శరత్ కుమార్ కూడా హాజరయ్యింది. సెలెబ్రేషన్స్ లో భాగంగా హీరో కార్తీ, రాధికా టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పాటకు చిందులేశారు.
“ది వారియర్” సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన “బులెట్” సాంగ్ కి రామ్ అండ్ క్రిటిశెట్టి కలిసి చిందేశారు. సోషల్ మీడియా రీల్స్ లో బాగా పాపులర్ అయిన ఈ పాటకు.. సూర్య దీపావళి వేడుకలో స్టెప్పులు సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోని నటి రాధికా ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది.
Deepavali with #sivakumar anna and family @Suriya_offl @Karthi_Offl #jotika @Brindhashiv pic.twitter.com/CQ4GOifyaO
— Radikaa Sarathkumar (@realradikaa) October 25, 2022