వామ్మో ఏం తెలివి?! : బంగారంతో పాటు సీసీటీవీ ఫుటేజీ కూడా ఎత్తుకుపోయిన దొంగలు..
హైదరాబాద్ చందానగర్ లోని నగల షాపులో జరిగిన చోరీ చూసి పోలీసులే షాక్ అయ్యారు.బంగారం, వెండి,నగదుతో పాటు చోరీ చేశాక పోలీసులకు చిక్కకుండా సీసీ టీవీ పుటేజ్ కూడా ఎత్తుకుపోయారు.దీంతో ఈ కేసును చేదించటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

Hyderabad Big Theft (1)
hyderabad big theft : దొంగతనం చేయటం ఆ తరువాత పోలీసులకు దొరకకుండా ఉండటం చోరకళలోని ప్రత్యేక అని చెప్పాలి. చోరీలు చేయటమే కాదు ఆ సొమ్ముతో ఎస్కేప్ అవ్వటం..ఆ తరువాత పోలీసులకు చిక్కకుండా ఉండటం ఈరోజుల్లో దొంగలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. హైదరాబాద్ నగరంలోని ఓ నగల షాపులో జరిగిన చోరీని చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. నగల షాపులో చోరీ చేసిన దొంగల తెలివికి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.
షాపులో చోరీకి వచ్చిన దొంగలు ఆ తరువాత ఎంత తెలివిగా పని చక్కబెట్టుకున్నాక వాళ్లు చేసిన పని తెలుసుకుని పోలీసులకు షాక్ తగిలినంత పని అయ్యింది. ఆ దొంగలు చేసిన పనేంటో తెలుసా? బంగారం, వెండి దోచుకున్నాక..తాము పట్టుబడిపోకుండా షాపులో ఉన్న సీసీటీవీ సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ని కూడా దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వారిని గుర్తించటానికి పట్టుకోవటానికి పోలీసులకు పెద్ద సవాలే అయ్యింది.
దీని గురించి తెలిసాక..వీరి తెలివి దొంగలెత్తుకెళ్ల కాదు కాదు..వీళ్ల తెలివి బందిపోటు దొంగలు ఎత్తుకెళ్లా అనుకోవాల్సిందే. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లోని రెహన్ జ్యువెలరీ అనే నగల దుకాణంలో చోరీ జరిగింది. దాదాపు 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.4 లక్షలు వరకూ నగదు అపహరణకు గురైనట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో షాపుకు వచ్చి పరిస్థితిని పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ని కూడా దుండగులు ఎత్తుకెళ్లిపోయారనీ గుర్తించారు. దొంగలు తెలివిగా వ్యవహరించి సీసీటీవీ ఫుటేజీ ఉంటే దొరికిపోతామని భావించి దాన్ని కూడా ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దుండగుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.