Covid Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య

దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Covid Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య

india covid up date

Updated On : August 7, 2022 / 9:47 AM IST

Covid Update :  దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. శుక్రవారంతో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య శనివారం స్వల్పంగా తగ్గింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మంది కోవిడ్ తదితర కారణాలతోమరణించారు. నిన్న 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదయిందని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.50 శాతం, యాక్టివ్ కేసులు 0.31 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.21 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర్రప్రభుత్వం పేర్కొన్నది.