Karnataka Auto Rickshaw Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితుడికి ఐసిస్‌తో సంబంధాలున్నట్లు గుర్తింపు

కర్ణాటకలోని మంగళూరు నగరంలో జరిగిన ఆటో రిక్షా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక విషయాలను రాబడుతున్నారు. నిందితుడు మహ్మద్‌ షరీక్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఐఎస్‌) సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

Karnataka Auto Rickshaw Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితుడికి ఐసిస్‌తో సంబంధాలున్నట్లు గుర్తింపు

Karnataka Auto Rickshaw Blas

Updated On : November 21, 2022 / 3:04 PM IST

Karnataka Auto Rickshaw Blast: కర్ణాటకలోని మంగళూరు నగరంలో జరిగిన ఆటో రిక్షా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక విషయాలను రాబడుతున్నారు. నిందితుడు మహ్మద్‌ షరీక్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఐఎస్‌) సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులను సంప్రదించడానికి డార్క్ వెబ్ ను ఉపయోగించాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు షరీక్ నివాసం నుంచి పోలీసులు కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Mangaluru Auto-rickshaw Blast : బాబోయ్.. రోడ్డుపై వెళ్తుండగా సడెన్‌గా బాంబులా పేలిన ఆటో.. మంగళూరులో ఒక్కసారిగా కలకలం, వీడియో

పేలుడు కేసుకు సంబంధించి.. ఏడీజీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. నవంబర్ 19 రాత్రి 7:40 గంటల సమయంలో మంగళూరు నగరం వెలుపల ఒక ఆటోలో తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రయాణికులు, డ్రైవర్లు ఉలిక్కిపడ్డారు. ఆటో డ్రైవర్‌ను పురుషోత్తం పూజారిగా, ప్రయాణికుడిని షరీక్‌గా గుర్తించారు. ఈ పేలుడు కేసులో నిందితుడు షరీక్‌పై మూడు కేసులు ఉన్నట్లు గుర్తించారు. మంగళూరు నగరంలో రెండు, శివమొగ్గలో ఒక కేసులు నమోదయ్యాయని అలోక్ కుమార్ తెలిపారు. రెండు కేసుల్లో నిందితుడిపై యూఏపీఏ కింద కేసు నమోదు చేయగా, మూడో కేసులో వాంటెడ్ గా ఉన్నాడు. నిందితుడు చాలా కాలంగా పరారీలో ఉన్నట్లు తెలిపాడు.

Mangaluru Blast: మంగళూరులో రోడ్డుపై ఆటో పేలుడు ఘటన ఉగ్ర చర్యే.. నిర్ధారించిన పోలీసులు

సెప్టెంబరు 19న తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అటవీప్రాంతంలో మరో ఇద్దరు సహచరులతో కలిసి షరీక్ ట్రయల్ బ్లాస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తరువాత నవంబర్ 20న పోలీసులు మాజ్ మునీర్, సయ్యద్ యాసిన్‌లను అరెస్టు చేశారు, అయితే షకీర్ పోలీసుల నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత దొంగిలించిన ఆధార్ కార్డుతో మైసూరులో అద్దెకు ఇల్లు తీసుకుని బాంబుల తయారీ ప్రాక్టీస్ చేస్తున్నాడు.