Jio Services Stopped : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జీయో సేవలు.. స్పందించని కంపెనీ

దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్‌, మెసేజింగ్‌ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు.

Jio Services Stopped : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జీయో సేవలు.. స్పందించని కంపెనీ

jio services stopped

Updated On : November 29, 2022 / 11:31 AM IST

jio services stopped : దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్‌, మెసేజింగ్‌ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు. ఈ విషయంపై పలువురు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. చాలా మంది వినియోగదారులు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు చెప్పారు.

గతంలోనూ జియో సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ సేవలు దాదాపు 3 గంటల పాటు నిలిచిపోయాయి. మొబైల్ డేటా సర్వీసెస్‌ను మాత్రం వినియోగించుకోగలిగారు. జియో సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌గా మారాయి. మరోవైపు ఓ యూజర్ తన మొబైల్‌లో ఉదయం నుంచి VoLTE సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు ట్వీట్‌ చేశారు.

Reliance Jio 5G speed: ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్ చేయవచ్చు

సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్‌ అవుతోంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. అయితే, ఇప్పటి వరకు సర్వీసులు నిలిచిపోవడంపై కంపెనీ స్పందించకపోవడం గమనార్హం.