kalvakuntla Kavitha: కేంద్ర కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలి: కల్వకుంట్ల కవిత
కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు.

Kalvakuntla Kavitha
kalvakuntla Kavitha: కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు. ‘‘కార్మికుల చెమట చుక్కల విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు నల్ల చట్టాలు తెస్తోంది. కేంద్రం తీరుతో అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలి. శ్రమదోపిడీని సహించవద్దు. కార్పొరేట్లకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. బొగ్గు గనులు, రైళ్లు, కరెంటు.. ఇలా అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తోంది.
Bangladesh woman: ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిన యువతి
అదానికి ఏడు ఎయిర్‌పోర్టులను అమ్మారు. మోదీకి మిత్రుడు కావడం వల్లే అదానీకి వాటిని కట్టబెట్టారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కేసీఆర్ కల. కార్మికుల హక్కులు కాపాడేందుకే పోరాడుతున్నాం. ఢిల్లీ రైతుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాడాలి. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ చెప్పారు. కానీ, ఉద్యోగాలు రాలేదు. మోదీ ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. మోదీకి ఎలక్షన్ మోడ్.. ఏరోప్లేన్ మోడ్ మాత్రమే తెలుసు. ఆయన ఉంటే ఎలక్షన్లలో.. లేదా విదేశాల్లో.. ఇదే మోదీ విధానం’’ అని కవిత అన్నారు.