Crazy complaint : రోజంతా మేత మేస్తున్నా..మా ఆవులు పాలు ఇవ్వట్లేదు సార్..పోలీసులకు రైతు ఫిర్యాదు
రోజంతా మేత మేస్తున్నా..మా ఆవులు పాలు ఇవ్వట్లేదు సార్ అంటూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రైతు ఫిర్యాదు విన్న పోలీసులు ఏం చేశారంటే..

Farmer Gives Police Complaint On Cows For Not Giving Milk
farmer gives police complaint on cows for not giving milk : ‘‘సార్..మా ఆవులు పాలు ఇవ్వటంలేదు సార్..ఎలాగైనా అవి పాలు ఇచ్చేలా మీరే ఏదొకటి చేయాలి సార్..’’ అంటూ ఓ రామయ్య అనే రైతు పోలీసులకు తన నాలుగు ఆవుల మీద ఫిర్యాదు చేశాడు. సదరు రైతు ఇచ్చిన ఫిర్యాదు విన్న పోలీసులు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. తరువాత నవ్వుతూ ‘రావయ్యా.. రామయ్యా..ఇలా కూర్చో అంటూ ఇటువంటి కేసులు పోలీసులు తీసుకోరయ్యా..ఎవరైనా పశువులు డాక్టర్ దగ్గరకెళ్లి ఈ విషయం చెప్పు..’’..అంటూ రామయ్యకు నచ్చజెప్పి పంపించేశారు పోలీసులు.
Read more : Viral Video:‘నా పెన్సిల్ దొంగిలించాడు..ఈడి మీద కేసు పెట్టండి సార్..’ పోలీసులకు బుడ్డోడు ఫిర్యాదు..
ఈ వింత ఫిర్యాదు వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా, భద్రావతి తాలుకా.. సిద్లిపురా గ్రామంలో రామయ్య అనే రైతుకు కొన్ని గేదెలు నాలుగు ఆవులున్నాయి. రామయ్య ప్రతీరోజు పశువుల్ని సిద్లిపుర గ్రామం సమీపంలో ఉన్న అడవీప్రాంతానికి తోలుకెళ్లి మోపుకుని తీసుకొస్తుంటాడు. పాలు బాగానే ఇచ్చేవి. ఎటువంటి ఇబ్బంది ఉండేదికాదు. కానీ గత గత నాలుగు రోజుల నుంచి అవి పాలు ఇవ్వడం లేదు. దీంతో రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read more : buffalo DNA : మా గేదెకు DNA టెస్ట్ చేయించండి సార్..ఎస్పీని వేడుకుుంటున్న రైతు
‘సార్..మా నాలుగు ఆవులు గత నాలుగు రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు సార్.. రోజూ వాటికి సరిపోయేంత మేత కూడా వేస్తున్నాను. అయినా అవి ఎందుకు పాలు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు సార్..ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు మేత కోసం వాటిని అడవికి తీసుకెళ్తా. ఇదివరకు బాగానే పాలు ఇచ్చేవి. కానీ.. నాలుగు రోజుల నుంచి అన్ని ఆవులు పాలు ఇవ్వడం లేదు. మీరే ఎలాగైనా అవి పాలు ఇచ్చేలా చేయండి సార్..’ అంటూ తన ఫిర్యాదు చేశాడు.
రామయ్య ఫిర్యాదు విన్న పోలీసులు మొదట షాక్ అయ్యారు. తరువాత నవ్వుకంటు మేం ఇటువంటి ఫిర్యాదు తీసుకోం అని..మీ ఆవుల్ని పశువుల డాక్టర్ కు చూపించు అంటూ రైతుకు నచ్చజెప్పి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. కాగా గత నెల కూడా మధ్యప్రదేశ్‌లో ఓ రైతు.. తన గేదె పాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేదె పాలు ఇవ్వడానికి నిరాకరిస్తోందని..ఎవరో చేతబడి చేశారని.. ఫిర్యాదు చేశాడు. కాగా ఇటీవల కాలంలో ఇటువంటి ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.
Read more : IPS Bharati Arora : ‘కృష్ణుడికి సేవ చేసుకోవాలి’ అంటూ రిజైన్ చేసిన మహిళా ఐపీఎస్