khairatabad ganesh nimajjanam 2022: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశ్.. గణపతి బప్పా మోరియా నినాదాలలో మారుమోగిపోయిన ట్యాంక్ బండ్
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహా గణపతి శోభాయాత్ర దాదాపు 6 గంటల పాటు జరిగింది. ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా గణపతి బప్పా మోరియా నినాదాలో మారుమోగిపోయింది.

khairatabad ganesh nimajjanam 2022
khairatabad ganesh nimajjanam 2022: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహా గణపతి శోభాయాత్ర దాదాపు 6 గంటల పాటు జరిగింది. ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా గణపతి బప్పా మోరియా నినాదాలో మారుమోగిపోయింది.
అక్కడ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఈ సారి 50 అడుగుల ఎత్తయిన భారీ గణనాథుడి విగ్రహాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు మహా గణపతిని సందర్శించుకున్నారు. కాగా, హైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పైకి భారీగా తరలివస్తున్నాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి అనంతరం కూడా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు, గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను నగర మేయర్ విజయలక్ష్మి స్వయంగా పరిశీలించారు. ఇవాళ ఆమె ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో పర్యటించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ట్యాంక్ బండ్ వద్ద 100 మంది గజఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సరూర్ నగర్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో గణేశ నిమజ్జనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. నిమజ్జనాల అనంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.
Bear Viral video: కారు డోరు తెరిచి లోపలికి వెళ్ళిన ఎలుగు బంటి.. వీడియో వైరల్