Kriti Sanon: ప్రభాస్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చేసిన కృతి!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బి-టౌన్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే అమ్మడు ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన ‘భేడియా’ మూవీలో నటించింది. ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

Kriti Sanon: ప్రభాస్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చేసిన కృతి!

Kriti Sanon Clarity On Her Relationship Rumours

Updated On : November 30, 2022 / 9:48 AM IST

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బి-టౌన్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే అమ్మడు ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన ‘భేడియా’ మూవీలో నటించింది. ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

Kriti Sanon: బచ్చన్ ఇంట్లోకి సనన్.. బాప్‌రే నెలకి లక్షల్లో అద్దె!

అయితే భేడియా చిత్ర ప్రమోషన్స్‌లో హీరో వరుణ్ ధావన్ కృతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. కృతి మనసులో ఓ హీరో ఉన్నాడని, ఆయన ప్రస్తుతం బాలీవుడ్‌లో లేడని.. దీపికా పదుకొనేతో ఓ సినిమా చేస్తున్నాడని వరుణ్ ధావన్ తెలిపాడు. దీంతో కృతిని ప్రేమిస్తున్న ఆ హీరో ఎవరా అని అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా, వరుణ్ ధావన్ చెప్పిన మాటల ప్రకారం ఆ హీరో మరెవరో కాదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చాలా మంది ఫిక్స్ అయ్యారు.

Kriti Sanon: స్లీవ్‌లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

అంతేగాక, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. ప్రభాస్, కృతి సనన్‌లపై అనేక మీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో కృతి సనన్ తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. వరుణ్ ధావన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలా మాట్లాడాడని.. తాను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని, అలా అని అది పీఆర్ స్టంట్ కాదని.. కేవలం జాలీగా మాట్లాడే ఉద్దేశ్యంతోనే వరుణ్ అలాంటి కామెంట్స్ చేశాడని కృతి చెప్పుకొచ్చింది. దీంతో కృతి సనన్ ప్రేమకు సంబంధించి వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.