LK Advani 94th Birthday : LK అద్వానీ 94వ పుట్టిన రోజు..కేక్ కట్ చేయించిన బీజేపీ అగ్రనేతలు

బీజేపీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ ప్ర‌ధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ,బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలిపారుే

LK Advani 94th Birthday : LK అద్వానీ 94వ పుట్టిన రోజు..కేక్ కట్ చేయించిన బీజేపీ అగ్రనేతలు

Lk Advani 94th Birthday

Updated On : November 8, 2021 / 11:42 AM IST

Lal Krishna Advani Turns 94 Birthday: బీజేపీ సీనియర్ నేత,రాజకీయ కురు వృద్ధుడు,భార‌త మాజీ డిప్యూటీ ప్ర‌ధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలియపారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు.. అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. అనంతరం అద్వానీతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు.

అద్వానీకి సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ప్ర‌ధాని మోదీ ప్రార్థించారు. సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో, ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలో ఈ దేశం అద్వానీకి రుణ‌ప‌డి ఉందని మోదీ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇవాళ పుట్టిన‌రోజు వేడుక సంద‌ర్భంగా.. అద్వానీ ఇంటి లాన్‌లో ఆయ‌నతో క‌లిసి ప్ర‌ధాని మోదీ న‌డిచారు. అద్వానీ ఓ స్పూర్తిదాయ‌క‌మైన‌, గౌర‌వప్ర‌ద‌మైన నేత అని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.

లాల్ కృష్ణ అద్వానీ. బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్‌లోని కరాచీలో 1927లో జన్మించారు. భారతదేశం అత్యంత గౌరవనీయమైన నాయకులలో అతను పరిగణించబడ్డారు. అతని పాండిత్యం, దూరదృష్టి, మేధో సామర్థ్యం, దౌత్యం అందరూ గుర్తించబడ్డారు. భగవంతుడు ఆయనను ఆయురారోగ్యాలతో ఉంచాలని పలువురు ప్రార్థించారు.