viral video: చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్న యువకుడు.. కోటీశ్వరుడు అవుతాడట
పాదరక్షలు వేసుకోకుండా కొన్ని రోజుల పాటు నడవాలని మీకెప్పుడైనా అనిపించిందా? జీవితాంతం చెప్పులు ధరించవద్దని ఎవరైనా అనుకుంటారా? చెప్పులు, బూట్ల వంటివి ఏవీ వేసుకోకుండా రోడ్లపై జీవితాంతం తిరగడం అసలు సాధ్యపడుతుందా? అసలు ఇటువంటి ఆలోచనా వచ్చినా ఈ పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారా? జార్జ్ వుడ్విల్లే అనే 20 ఏళ్ళ ఈ యువకుడు ఇదే పని చేస్తున్నాడు మరీ.

Foot
viral video: పాదరక్షలు వేసుకోకుండా కొన్ని రోజుల పాటు నడవాలని మీకెప్పుడైనా అనిపించిందా? జీవితాంతం చెప్పులు ధరించవద్దని ఎవరైనా అనుకుంటారా? చెప్పులు, బూట్ల వంటివి ఏవీ వేసుకోకుండా రోడ్లపై జీవితాంతం తిరగడం అసలు సాధ్యపడుతుందా? అసలు ఇటువంటి ఆలోచనా వచ్చినా ఈ పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారా? జార్జ్ వుడ్విల్లే అనే 20 ఏళ్ళ ఈ యువకుడు ఇదే పని చేస్తున్నాడు మరీ. అతడు ఈ పని ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుందామా..? ఇప్పటికే ఈ యువకుడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 నెలల పాటు చెప్పులు లేకుండా తిరిగాడు. తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు పాదరక్షలు ధరించబోనని చెబుతున్నాడు.
ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్ నగరంలో కుటుంబ సభ్యులతో కలిసి గత ఏడాది అక్టోబరులో జార్జ్ వుడ్విల్లే ఓ ట్రిప్‌కు వెళ్ళాడు. ఆ సమయంలో చెప్పులు వేసుకోవద్దన్న ఆలోచన వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు వేసుకోలేదని తాజాగా చెప్పాడు. తాను తొలిసారి బూట్లు విప్పి తిరిగినప్పుడు చాలా స్వేచ్ఛగా అనిపించిందని, మరోసారి వాటిని వేసుకోవద్దని భావించానని అన్నాడు. ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసుకుని దానికి ప్రొఫైల్ ఫొటోగా తన అరికాళ్ళ ఫొటో పెట్టుకున్నాడు.
చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ పలువురిని కలుస్తూ వీడియోలు తీసుకుంటున్నాడు. చెప్పులు లేకుండా ఎప్పుడైనా తిరిగారా? అని వారిని కూడా అడుగుతున్నాడు. ఇలా బార్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, నౌట్‌క్లబ్‌లు అన్ని ప్రాంతాల్లోనూ చెప్పులు లేకుండానే అతడు కనపడుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఇతడు ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. అతడి ఫొటోలకు మంచి డిమాండ్ వచ్చింది. చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్న అతడి అలవాటే ఇప్పుడు ఆయనకు డబ్బులు తెచ్చిపెడుతోంది.
మరో ఐదేళ్ళలో తాను కోటీశ్వరుడిని అయిపోతానని చెప్పాడు. తాను ఊహించనంత డబ్బు తనకు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు. తాను పాదరక్షలు వేసుకోకుండా తిరుగుతుంటే కొందరు మెచ్చుకుంటున్నారని, కొందరు విమర్శిస్తున్నారని చెప్పాడు. ఇన్‌స్టా, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తాను ఫొటోలు, వీడిలు పోస్ట్ చేస్తుంటానని తెలిపాడు. చెప్పులు వేసుకోకుండా సూపర్ మార్కెట్ వంటి చోట్లకు వెళ్తే ఒక్కోసారి తనను వాటిల్లోకి రానివ్వబోరని చెప్పాడు. చెప్పులు లేకుండా తిరుగుతోన్న తన ఫొటోలు, వీడియోల వల్ల ఆదాయం వస్తోందని తెలిపాడు.
View this post on Instagram
View this post on Instagram