గుప్త నిధుల ఆశ చూపి బాలికపై రేప్
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం

మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. కొందరి అత్యాశ, అజ్ఞానం కేటుగాళ్లకు వరంగా మారుతోంది. సైన్స్ బాగా డెవలప్ అయిన ఈ రోజుల్లోనూ ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఆ నమ్మకాలే ప్రజల కొంప ముంచుతున్నాయి. హత్యలు, అత్యాచారాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిలాల్లో అలాంటి ఒక దారుణం చోటు చేసుకుంది. గుప్త నిధుల పేరు చెప్పి ఓ నీచుడు బాలికను అత్యాచారం చేశాడు.
తాయత్తులు కట్టేందుకు వచ్చి అఘాయిత్యం:
ఇంట్లో గుప్త నిధులున్నాయని.. అవి దక్కాలంటే బాలికతో కలిసి పూజలు చేయాలని నమ్మించి ఆమెపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం మాచవరానికి చెందిన విష్ణువర్ధన్ రోగాలు నయం చేస్తానని తాయత్తులు కడుతుంటాడు. దొనకొండ మండలం రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో ఇటీవల పరిచయమైంది. కొందరికి తాయత్తులు కట్టేందుకు విష్ణువర్ధన్ ను రామాంజనేయులు గ్రామానికి పిలిపించాడు. తెలిసిన వారింట్లో బస ఏర్పాటు చేశాడు.
పూజల పేరుతో బాలికపై పలుమార్లు అత్యాచారం:
ఈ క్రమంలో ఇంటి యజమాని కుమార్తెపై విష్ణు కన్నుపడింది. దీంతో ఓ పథకం రూపొందించాడు. మీ ఇంట్లో గుప్తనిధులున్నాయని ఇంటి యజమానితో చెప్పాడు. బాలికతో పూజలు చేయిస్తే వెలికితీయొచ్చని అతడిని నమ్మించాడు. విష్ణు మాయలో పడి కళ్లుమూసుకుపోయిన రామాంజనేయులు అతడి మాటలు గుడ్డిగా నమ్మేశాడు. గుప్త నిధులు పేరు వినగానే అతడిలో అత్యాశ మొదలైంది. వెంటనే విష్ణు చెప్పిన దానికి అంగీకరించాడు. పూజలకు ఏర్పాటు చేశాడు. బాలికను గదిలోకి పంపాడు. ఇదే అదనుగా విష్ణు రెచ్చిపోయాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విష్ణు తీరుపై గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్నాయని అంతా భయపడ్డారు. దీంతో విష్ణుని నిలదీశారు. అప్పుడు అత్యాచార విషయం బయటపడింది. దీంతో అంతా కలిసి అతనికి దేహశుద్ధి చేశారు.
గుప్తనిధులు అవాస్తవం:
గుప్త నిధులు అనే మాట అవాస్తవం అని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అలా ఎవరైనా చెబితే వారు మోసగాళ్లు అనే విషయం తెలుసుకోవాలంటున్నారు. అత్యాశకు పోయి అనర్థాలు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. గుప్త నిధుల పేరుతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Read Here>> టిక్ టాక్ లో పరిచయం, ఆపై అత్యాచారం.. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం