Mango-Poori Combination : పాతదే కొత్తగా.. మ్యాంగో జ్యూస్-పూరీ.. వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్

ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్‌ను ట్విట్టర్ యూజర్ ఒకరు పోస్ట్ చేయడంతో ఈ కాంబినేషన్ ఇంటర్నెట్‌లో చర్చకు దారి తీసింది.

Mango-Poori Combination : పాతదే కొత్తగా.. మ్యాంగో జ్యూస్-పూరీ.. వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్

Mango juice-poori combination viral

Mango juice-poori combination viral : వేసవికాలం (summer) ఎప్పుడు వస్తుందా? అని మ్యాంగో లవర్స్ (mango lovers) ఎదురుచూస్తారు. ఎందుకంటే చాలామందికి మామిడిపండ్లు చాలా ఇష్టం. ఈ సీజన్ లో మామిడిపండ్లతో జ్యూస్ (mango juice) లు, స్వీట్లు, కాయలతో ఊరగాయలు, రకరకాల పచ్చళ్లు పెడతారు. నిజానికి మామిడి అతి వేడి అంటారు కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో చాలామంది ఇష్టంగా తింటారు. మామిడిపండ్లను చాలామంది భోజనంలో కూడా తింటారు. అయితే కొంతమంది పూరీలో (puri) మామిడి రసాన్ని నంజుకుని తింటారు. ఈ కాంబినేషన్ గురించి చాలామందికి తెలిసినా తాజాగా మళ్లీ ఈ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. @MSDianAbhiii అనే ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ చూసి డిఫరెంట్ కాంబినేషన్ అని చాలామంది ఆశ్చర్యంగా రిప్లై చేయడంతో ఈ కాంబినేషన్ వైరల్ అయ్యింది.

NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..

తీయని మామిడి రసం, నూనెలో వేయించిన పూరీ రెండూ భిన్న రుచులు. ఈ కాంబినేషన్ గురించి తెలియని వారికి నిజంగానే విచిత్రంగా అనిపించవచ్చు. అయితే ఈ కాంబినేషన్ గురించి చాలామందికి తెలుసు. గుజరాత్ (gujarat), మహారాష్ట్రలలో (maharashtra) ఈ కాంబినేషన్ ను ఎంతో ప్రసిద్ధి. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ ని ట్విట్టర్ యూజర్ @MSDianAbhiii పోస్ట్ చేస్తూ “స్లీపింగ్ పిల్స్ ప్రో మాక్స్” క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన జనాలు ఆశ్చర్యంగా పోస్టులు పెట్టడంతో చర్చ మొదలైంది. అసలు ఈ కాంబినేషన్ గురించి వినలేదని కొందరు.. ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన ఈ కాంబినేషన్ గురించి తెలియకపోవడం ఏంటని కొందరు అభిప్రాయపడ్డారు.

Viral Food Video: వెరైటీ ఫుడ్.. ఐస్ క్రీమ్ రోల్ టేస్ట్ చేస్తారా? వైరల్ అవుతున్న వీడియో

ఈ మధ్యకాలంలో రకరకాల ఫుడ్ కాంబినేషన్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అందరికీ తెలిసిన ఈ కాంబినేషన్ కొత్తగా వైరల్ కావడం విచిత్రం అనిపిస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ కాంబినేషన్ గురించి తెలియని వారికి @MSDianAbhiii పోస్ట్ కొత్త కాంబినేషన్ ని పరిచయం చేసినట్లే.