లైట్ తీస్కో.. ఆ పంతులు మందిస్ట్..

లైట్ తీస్కో.. ఆ పంతులు మందిస్ట్..

Updated On : December 17, 2020 / 7:28 PM IST

Master Telugu Teaser: ‘దళపతి’ విజయ్ కథానాయకుడిగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న కోలీవుడ్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. మాళవికా మోహనన్ కథానాయిక. ఇటీవల కార్తి ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో XB Film Creators నిర్మిస్తోంది.

ఇటీవల విడుదల చేసిన తమిళ్ టీజర్‌కి రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టింది. గురువారం తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. తెలుగులో ‘మాస్టర్’ పేరుతోనే డబ్ అవుతోంది.
విజయ్ తన మార్క్ స్టైల్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా.. విజయ్ సేతుపతి ఎప్పటిలానే క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయాడు.

సత్యన్ సూర్యన్ విజువల్స్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ‘మాస్టర్’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.