Bulk Drug Park : కేంద్రం,తెలంగాణ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ రగడ .. తెలంగాణపై వివక్షతోనే కేటాయించలేదంటూ కేటీఆర్ ఫైర్
అసలే ఉప్పు..నిప్పులా ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మధ్య తాజాగా బల్క్ డ్రగ్ పార్క్ రగడ రాజుకుంది. తెలంగాణను కాదని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించటంతో రాజకీయ రగడ ముదురుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి ఇచ్చిందని తెలంగాణపై ఉన్న వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెడుతుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Bulk Drug Park
Bulk Drug Park : అసలే ఉప్పు..నిప్పులా ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మధ్య తాజాగా బల్క్ డ్రగ్ పార్క్ రగడ రాజుకుంది. తెలంగాణను కాదని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించటంతో రాజకీయ రగడ ముదురుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి ఇచ్చిందని తెలంగాణపై ఉన్న వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెడుతుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని వసతులతో దేశానికి ఫార్మాహబ్ గా ఉన్న తెలంగాణకు ఎందుకు కేటాయించలేదు? ఈ పార్క్ కోసం 2వేల ఎకరాలు కేటాయించి ఎదురు చూస్తున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని దీని వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు కేటీఆర్. ఈ విషయంలో కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్ లేఖ రాశారు.
దేశ వ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్క్ కోసం 13 రాష్ట్రాలు పోటీ పడితే మూడు రాష్ట్రాలకు మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్ ను దక్కించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడగా ఏపికి అవకాశం దక్కింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలోను బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో బల్క్ డ్రగ్ పార్క్ తెలంగాణకు కేటాయించకపోవటంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటి అత్యంత అనుకూలమని..భూ సేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మాసిటిని కేంద్రం కావాలనే విస్మరిస్తోందని విమర్శలు గుప్పించారు కేటీఆర్.కొత్తగా బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయాలంటే మూడేళ్లు పడుతుందని అన్ని సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటిని పరిగణలోకి తీసుకోకపోవడం కేంద్రానికి ఉన్న నిబద్దతను తెలియచేస్తుందన్నారు. వెంటనే తెలంగాణ బల్క్ డ్రగ్ పార్కును కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.
– అన్ని అనుకూలతలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండి చేయి ముమ్మాటికీ వివక్షే
– వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి @KTRTRS డిమాండ్
— TRS Party (@trspartyonline) September 2, 2022
– కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్లు పడుతుందన్న కేటీఆర్
– అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకుపోకపోవడం, ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి నిదర్శనం
— TRS Party (@trspartyonline) September 2, 2022