Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.

Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Mukkoti Ekadasi

Updated On : January 13, 2022 / 6:29 AM IST

Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆలయాలల్లో వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ఆయా ఆలయాల అధికారులు ప్రకటించారు.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకుంది. శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించిన అర్చకులు.. 1.45 నుంచి స్వామివారి దర్శనం కల్పించారు. శ్రీవారి సేవలో ప్రముఖులు.. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా భార్య సుచిత్ర ఎల్లాతో కలిసి బాలాజీని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థ తరఫున శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2కోట్ల విరాళాలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌కు అందజేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సహా.. ఏపీలో వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదారవరి జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఉదయం యాదాద్రిలోని ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. అటు భద్రాచలంలోనూ వైకుంట ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వరీ ఆలయంలో కూడా అమ్మవారు ఉత్తరద్వార దర్శనమిస్తున్నారు.