Navjot Singh Sidhu: జైలులో క్లర్కుగా మారిన సిద్ధూ.. మూడు నెలల తర్వాతే జీతం

నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్‌లో ఆయన క్లర్కుగా పని చేస్తారు.

Navjot Singh Sidhu: జైలులో క్లర్కుగా మారిన సిద్ధూ.. మూడు నెలల తర్వాతే జీతం

Navjot Singh Sidhu

Updated On : May 25, 2022 / 6:59 PM IST

Navjot Singh Sidhu: రోడ్డుమీద ఒక వ్యక్తిపై దాడి చేసి, అతడి మృతికి కారణమైన కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు సిద్దూ. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు.. అనుమతించిన పనుల్లో ఏదో ఒకటి చేయాలి.

Online Games: ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణకు కమిటీ

దీంతో నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్‌లో ఆయన క్లర్కుగా పని చేస్తారు. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన క్లర్కుగా పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బందికి అవసరమైన ఫైల్స్ అందివ్వాలి. అయితే, ఆయనకు మొదటి మూడు నెలలు దీనికి ఎలాంటి వేతనం ఇవ్వరు. ఎందుకంటే ఈ పనిలో ఆయనకు ఇంతకుముందు నైపుణ్యం లేదు. కాబట్టి, సిద్ధూను అన్‌స్కిల్డ్ లేబర్‌గా, ట్రెయినీగా గుర్తిస్తారు. దీంతో మూడు నెలల వరకు జీతం ఉండదు. ఆ తర్వాత ఆయనకు రోజుకు ముప్పై రూపాయలు ఇస్తారు.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తర్వాత ఇది నెమ్మదిగా తొంభై రూపాయలకు చేరుతుంది. మరోవైపు జైలులో సిద్ధూ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ఆయనను ఇతర ఖైదీలు ఉండని ఫ్యాక్టరీ, బేకరీలకు దూరంగా ఉంచారు. సిద్ధూ బాగా చదువుకున్న వ్యక్తి కూడా కావడంతో ఆయనకు క్లర్కుగా పని అప్పగించినట్లు జైలు సూపరిండెంట్ తెలిపారు. సిద్ధూ ఇంకో ఏడాది పాటు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.