Vijayasai Reddy: రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి సహా పలువురి ప్రమాణ స్వీకారం

రాజ్య‌స‌భ‌లో కొత్త సభ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. విజ‌య‌సాయిరెడ్డి, రాజీవ్ శుక్లా, మీసా భార‌తి, ప్ర‌పుల్ ప‌టేల్, బీద మ‌స్తాన్ రావు, హ‌ర్భ‌జ‌న్ సింగ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. లోక్‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన కాసేప‌టికే వాయిదాప‌డ్డాయి.

Vijayasai Reddy: రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి సహా పలువురి ప్రమాణ స్వీకారం

Vijaya Sai

Updated On : July 18, 2022 / 12:21 PM IST

Vijayasai Reddy: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. జ‌పాన్ మాజీ పీఎం షింజో అబే, యూఏఈ మాజీ అధ్య‌క్షుడు షేక్ ఖ‌లీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సంగీత విద్వాంసుడు శివ‌కుమార్ శ‌ర్మ మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తూ రాజ్య‌స‌భ‌లో స‌భ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రాజ్య‌స‌భ‌లో కొత్త సభ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. విజ‌య‌సాయిరెడ్డి(Vijayasai Reddy), రాజీవ్ శుక్లా, మీసా భార‌తి, ప్ర‌పుల్ ప‌టేల్, బీద మ‌స్తాన్ రావు, హ‌ర్భ‌జ‌న్ సింగ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

లోక్‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన కాసేప‌టికే వాయిదాప‌డ్డాయి. నేటి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు లోక్‌స‌భ‌ను వాయిదా వేశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో చాలా మంది స‌భ్యులు ఓటు వేయ‌డానికి వెళ్ళాల్సి ఉన్నందున లోక్‌స‌భ వాయిదా పడింది. మ‌రోవైపు, ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. లోక్‌సభలో న‌లుగురు కొత్త స‌భ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ పార్లమెంటు వర్షాకాల స‌మావేశాల్లో(Parliament Monsoon Session) మొత్తం 32 బిల్లుల‌ను ప్ర‌వేశపెట్ట‌నున్నారు.

England vs India: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు