చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కంటతడి..

చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కంటతడి..

Updated On : January 25, 2021 / 4:40 PM IST

Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9 న చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. మెగా, అల్లు కుటుంబాల వారు ఈ పెళ్లి వేడుకలో ఎంతటి సందడి చేశారో మనం చూశాం. నిహారిక ఇటీవలే అత్తారింట్లో అడుగు పెట్టారు. నిహారిక, చైతన్యల పెళ్లి వేడుకను ఎడిట్ చేసి వీడియో రూపంలో షేర్ చేశారు. పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న సమయంలో చైతన్య తనకు పంపిన మెసేజ్ చూసి ఎమోషనల్ అయ్యారు నిహారిక.. అలాగే తాళి కడుతున్న సమయంలోనూ భావోద్వేగానికి గురయ్యారు..
చైతన్య, నిహారికకు ఇలా మెసేజ్ పంపారు..

‘‘డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను.. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది..’’ అని పేర్కొన్నారు చైతన్య. ఇక కాబోయే వాడు అంత ప్రేమగా ఈ మాటలు చెప్పడంతో అది విన్న నిహారిక పట్టరానంత ఆనందంతో ఏడ్చేశారు. కళ్యాణ తిలకం దిద్దుతున్న చిరంజీవి పెద్ద కూతూరు సుష్మితను హత్తుకొని చాలా ఎమోషనల్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)