NTR: ఎన్టీఆర్ 30.. ఇంకెన్ని రోజులో?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి మూడేళ్లకు పైగానే అవుతుంది. ‘అరవింద సమేత’ సినిమా తరువాత తారక్ కేవలం ఆర్ఆర్ఆర్ కోసమే తన సమయాన్ని కేటాయించాడు. ఈ సినిమాను దర్శకుడు.....

NTR: ఎన్టీఆర్ 30.. ఇంకెన్ని రోజులో?

Ntr 30 Movie To Get More Delay

Updated On : March 18, 2022 / 10:57 AM IST

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి మూడేళ్లకు పైగానే అవుతుంది. ‘అరవింద సమేత’ సినిమా తరువాత తారక్ కేవలం ఆర్ఆర్ఆర్ కోసమే తన సమయాన్ని కేటాయించాడు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటం, మరో హీరో రామ్ చరణ్‌తో కలిసి పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తీర్చిదిద్దుతుండటంతో ఆర్ఆర్ఆర్‌పై తారక్ మొదట్నుండీ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయినా కూడా తారక్ తన నెక్ట్స్ సినిమాను ఇంకా పట్టాలెక్కించకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన ఎన్టీఆర్, ఇంకా ఈ సినిమాను ప్రారంభించలేదు.

NTR : రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం తారక్ మార్చి 25 వరకు బిజీగా ఉండనున్నాడు. దీంతో అప్పటివరకు ఆయన తన నెక్ట్స్ మూవీని ప్రారంభించే ప్రసక్తే లేదు. అటు దర్శకుడు కొరటాల శివ కూడా ఆయన తాజా చిత్రం ఆచార్య చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా మారుతున్నాడు. ఆయన ఆచార్య కోసం ఏప్రిల్ 29 వరకు బిజీగా ఉంటారు. దీంతో వీరిద్దరు కలిసి తమ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 7నే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకుంటున్న కారణంగా, ఆమె నటించిన ‘గంగూబాయ్ కతియావాడి’ కోసం ఆమె బిజీగా మారింది. దీంతో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

NTR : నా భార్య బర్త్‌డే వదిలేసి చరణ్ కోసం వెళ్ళేవాడిని

ఈ లెక్కన ఇప్పట్లో ఎన్టీఆర్ 30వ చిత్రం పూజా కార్యక్రమం ఎప్పుడు జరుపుకుంటుందా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే ఈ సినిమా ఓపెనింగ్‌కు తారక్, కొరటాలతో పాటు ఆలియా భట్ కూడా ఖచ్చితంగా ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఓపెనింగ్‌లో తారక్-ఆలియా కనిపిస్తే, ఈ సినిమాపై జాతీయ మీడియా కన్ను కూడా పడుతుందని, తద్వారా ఈ సినిమాకు నార్త్‌లో కూడా మంచి హైప్ క్రియేట్ చేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఏదేమైనా తమ ప్లాన్స్ కోసం ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని ఇంకా ఎన్ని రోజులు పెండింగ్‌లో పెడతారో అంటూ తారక్ అభిమానులు ఉసూరుమంటూ ఎదురుచూస్తున్నారు.