Osmania University: జూలై మొదటివారంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు!
ఇంత కాలం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలు ఇప్పుడు ఒక్కొక్కటీ నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.

Osmania University
Osmania University: ఇంత కాలం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలు ఇప్పుడు ఒక్కొక్కటీ నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. చివరి సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని వర్సిటీ వర్గాలు సూచించాయి.
రూ.300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించాయి. ఎగ్జామ్ ఫీజు, టైం టేబుల్, ఎగ్జామ్స్ గురించి ఇతర వివరాల కోసం విద్యార్ధులు ఓయూ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు. వర్సిటీ పరిధిలోని కళాశాల పిన్సిపాళ్లు విద్యార్థులు ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులు సూచించారు.
Read:Huzurabad:ఈటలే కాదు కేసీఆర్ వచ్చిన స్వాగతిస్తా : పెద్దిరెడ్డి